ఎన్నికల్లో జనసేన టీడీపీలు పైకి శత్రువులు. లోపల మిత్రులు..?

ఏపీలో ఎన్నికల భేరి మోగింది. రాజకీయ పార్టీలు అన్ని కూడా ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషించబోతోంది అనేది సర్వత్రా చర్చకు దారి తీస్తోంది. ఒకవైపు వైసీపీ లో టికెట్లు దొరక్క చాలామంది అసంతృప్తి చెందుతున్నారు.. అటు అధికార టీడీపీలో అయితే దీనికోసం వీధికి ఎక్కారు కూడా. ఇక అలాంటి వారందరూ కూడా ఇండిపెండెంట్స్ గా పోటీ చేస్తామని […]

ఎన్నికల్లో జనసేన టీడీపీలు పైకి శత్రువులు. లోపల మిత్రులు..?

Edited By:

Updated on: Feb 14, 2020 | 1:13 PM

ఏపీలో ఎన్నికల భేరి మోగింది. రాజకీయ పార్టీలు అన్ని కూడా ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషించబోతోంది అనేది సర్వత్రా చర్చకు దారి తీస్తోంది. ఒకవైపు వైసీపీ లో టికెట్లు దొరక్క చాలామంది అసంతృప్తి చెందుతున్నారు.. అటు అధికార టీడీపీలో అయితే దీనికోసం వీధికి ఎక్కారు కూడా. ఇక అలాంటి వారందరూ కూడా ఇండిపెండెంట్స్ గా పోటీ చేస్తామని అంటున్నారు తప్ప ఒక్కరు కూడా జనసేన వైపు చూడట్లేదు.

అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది.? జనసేనలోకి భారీగా వలసలు ఎందుకు లేవు.? మరోవైపు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఇతర పార్టీల నుంచి నేతలు ఎడా పెడా వలసలు వచ్చారు. అయితే ఇప్పుడు మాత్రం ఆ ఊసే లేదు. పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేసి ముఖ్యమంత్రి అయిపోవడం ఖాయం అని అందరూ అప్పట్లో విశ్వాసాన్ని వ్యక్తం చేసుకుంటూ ఉన్నారు. అయితే ఆ విశ్వాసం మాత్రం ఇప్పుడు ఎవ్వరిలోనూ కలిగినట్లు అనిపించట్లేదు.

అందుకేనేమో జనసేనలోకి వలసల ఊసే లేదు. వారం రోజుల్లో నామినేషన్ ప్రక్రియ మొదలవనున్న తరుణంలో  వైసీపీ- టీడీపీ గేట్ల ముందే నేతలు ఎదురు చూస్తున్నారు తప్ప జనసేన తలుపులు మాత్రం తట్టడం లేదు.

ఇక ఇలా ఉంటే జనసేన విషయంలో వినిపిస్తున్న టాక్ ఏంటంటే.. ఆ పార్టీ కేవలం ఫ్రెండ్లీ కంటెస్ట్ మాత్రమే చేస్తోందని.. ఈ ఎన్నికల్లో జనసేన కేవలం స్నేహపూర్వకంగా పోటీ మాత్రమే చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఎవరితో ఆ స్నేహం అంటే అధికారిక పార్టీనే అని కొందరు అంటున్నారు.

తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం కోసం జనసేన ఈవిధంగా పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అటు జనసేన విజయానికి కూడా టీడీపీ సహకరిస్తోంది అని వినికిడి. వారు అనౌన్స్ చేసిన చోట్ల టీడీపీ బలహీనమైన అభ్యర్థులను పెడుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా దీనిలో ఎంతవరకు నిజం ఉందొ తెలియాలంటే ప్రచారం వరకు ఆగాల్సిందే.