ఆ హిట్ సీక్వెల్‌కు రష్మిక నో చెప్పిందా.?

ఇండస్ట్రీకి వచ్చిన అనతికాలంలో వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను సంపాదించుకుంది రష్మిక మందన్న. ఓ హిట్ మూవీ సీక్వెల్‌కు నో చెప్పిందని ఫిల్మ్‌నగర్‌లో టాక్ నడుస్తోంది.

ఆ హిట్ సీక్వెల్‌కు రష్మిక నో చెప్పిందా.?

Updated on: Jun 19, 2020 | 9:46 PM

ఇండస్ట్రీకి వచ్చిన అనతికాలంలో వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను సంపాదించుకుంది రష్మిక మందన్న. ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రష్మిక.. ఓ హిట్ మూవీ సీక్వెల్‌కు నో చెప్పిందని ఫిల్మ్‌నగర్‌లో టాక్ నడుస్తోంది. కన్నడ సూపర్ హిట్ మూవీ ‘కిర్రాక్ పార్టీ’తో రష్మిక మందన్నా చిత్ర పరిశ్రమకు అరంగేట్రం చేసింది. హీరో రక్షిత్ శెట్టితో కలిసి రష్మిక అందరినీ ఆకట్టుకుంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ త్వరలోనే రూపొందనుందని సమాచారం. ఇందులో నటించడానికి రష్మిక మందన్న నో చెప్పిందట. అందుకు కారణం ఆమె మాజీ లవర్ రక్షిత్ శెట్టినే అని తెలుస్తోంది. అయితే దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా గతంలో రక్షిత్ శెట్టి, రష్మికలకు నిశ్చితార్ధం జరగడం, బ్రేకప్ అయిన సంగతి విదితమే.