ఎన్టీఆర్ సినిమాకు.. ఇది ‘2.0 వెర్షన్’ అట..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా 1958లో విడుదలైన సీనియర్ ఎన్టీఆర్, సావిత్రిల సూపర్ హిట్ మూవీ ‘ఇంటి గుట్టు’కు ఫ్రీమేక్ అని ఫిలిం నగర్‌లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాపై కాపీ ఆరోపణలు రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అయితే గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ […]

ఎన్టీఆర్ సినిమాకు.. ఇది 2.0 వెర్షన్ అట..?

Updated on: Nov 24, 2019 | 12:52 AM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా 1958లో విడుదలైన సీనియర్ ఎన్టీఆర్, సావిత్రిల సూపర్ హిట్ మూవీ ‘ఇంటి గుట్టు’కు ఫ్రీమేక్ అని ఫిలిం నగర్‌లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాపై కాపీ ఆరోపణలు రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

అయితే గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అజ్ఞాతవాసి’ సినిమాపై కూడా కాపీ వివాదం చెలరేగింది. హాలీవుడ్ డైరెక్టర్ జెరోమీ సాల్లే.. తన సినిమా ‘లార్గో వించ్’ను ఫ్రీమేక్ చేశారని ఆరోపణలు చేశాడు. ఇకపోతే పవర్ స్టార్ నటించిన ఈ మూవీ టాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్ ప్లాప్‌‌ల్లో ఒకటిగా నిలిచింది.

ఒక్క తెలుగులోనే కాదు మిగతా భాషల్లో కూడా పలు ఫ్రీమేక్ మూవీస్ తెరకెక్కి ఘోర పరాజయాలు చవి చూశాయి. అందులో ఒకటిగా చెప్పుకునేది ‘రాబ్తా’. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నింటినీ ‘రాబ్తా’ చిత్ర యూనిట్ అవాస్తవాలేనని కొట్టిపారేసింది.

కాగా, విడుదల కాక ముందే ‘అల.. వైకుంఠపురములో’ సినిమాపై కాపీ ఆరోపణలు వేయడం కరెక్ట్ కాదు. ఏది ఏమైనా త్రివిక్రమ్ ఈ సినిమాతో పెద్ద హిట్ సాధించాలని కోరుకుందాం.