Irrfan Khan’s Son Babil : సినిమాల్లోకి మరో వారసుడు.. వెండితెరకు పరిచయం కానున్న దివంగత నటుడి కుమారుడు
సినిమా ఇండస్ట్రీలో వారసులు ఎంట్రీలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగు, తమిళ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది వారసులు నటులుగా కొనసాగుతున్నారు..
Irrfan Khan’s Son Babil : సినిమా ఇండస్ట్రీలో వారసులు ఎంట్రీలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగు, తమిళ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది వారసులు నటులుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే త్వరలో బాలీవుడ్ లోకి మరో నటవారసుడు రాబోతున్నాడని తెలుస్తుంది. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమయ్యాడని తెలుస్తుంది.
చదువు పూర్తయిన తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టాలని చూస్తున్నానని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు బాబిల్ ఖాన్. ప్రస్తుతం ఈ కుర్రాడు లండన్ లో గ్యాడ్యుయేషన్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. క్యాన్సర్ కారణంగా నటుడు ఇర్ఫాన్ ఖాన్ గత ఏడాది ఏప్రిల్ 29న కన్నుమూసిన విషయం తెలిసిందే. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా తెలుగులోను ఆయన సుపరిచితుడే. ఇక హాలీవుడ్ సినిమాల్లోనూ ఇర్ఫాన్ తన నటనతో ఆకట్టుకున్నారు. క్యాసర్ మహమ్మారితో పోరాడుతూ ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూశారని తెలిసి సినీలోకం విషాదంతో నిండిపోయింది.
మరిన్ని ఇక్కడ చదవండి :
Red Movie: రామ్ ‘రెడ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. మంగళవారం సాయంత్రం 6 గంటలకు..