టాలీవుడ్‍లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ‘ఆర్.ఆర్.ఆర్’ దర్శకదీరుడు రాజమౌళి.. స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న ఈ సినిమా గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభం అయిందని ఫోటోతో సహా షేర్ చేసింది చిత్రయూనిట్. ఇందులో బాలీవుడ్ నటి అలియాభట్, హాలీవుడ్ నటి ఓలీవియా మోరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా.. దర్శక దీరుడికి ఐరిష్ బ్యూటీ షాక్ ఇచ్చింది. సినిమా విడుదల తేదీ ఇదేనంటూ తన ట్విట్టర్ ఖతాలో ప్రకటించేసిందే. దీంతో చిత్రయూనిట్ ఒక్కసారిగా షాక్‌కు గురైంది.
పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులతోపాటు, హాలీవుడ్ నటులు కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిలో ఐరిష్ నటి అలిసన్ డూడీ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇటివలే ఈ సినిమా షూటింగ్లో ఈ నటి పాల్గొంది. తాజాగా తన ట్విట్టర్లో ఈ సినిమా గురించి స్పందిస్తూ.. పొరపాటున విడుదల తేదీని ప్రకటించేసింది. ఆర్ఆర్ఆర్ సినిమా అక్టోబర్ 8న విడుదలవుతోందంటూ అసలు విషయాన్ని బయటపెట్టేసింది. దీంతో ఈ నటి చేసిన పనికి రాజమౌళీ తన సినిమా విడుదల తేదీని మారుస్తాడా ? లేదా ? అనేది చూడాలి. ఏదేమయిన ఈ అమ్మడు చేసిన పనికి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. చిత్రయూనిట్ మాత్రం ఇప్పటికే షాక్‌లోనే ఉంది.
#RRR actress #AlisonDoody posted on #Instagram that The #RRR movie will be released on October 8th 2021. Later She deleted that post.
— @Yeruvaka99 – Bujji (@Yeruvaka99) January 22, 2021
Also Read:
Pushpa Movie Update: పాన్ ఇండియా లెవల్లో ‘పుష్ప’ ? బన్నీ ప్లాన్ మాములుగా లేదుగా..