లంక లీగ్‌లో ఇర్ఫాన్ పఠాన్…
ఐపీఎల్ ముగిసిన వెంటనే లంక ప్రీమియర్ లీగ్ మొదలు కానుంది. ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఎల్‌పీఎల్‌లో చాలామంది మేటి క్రికెటర్లు పాల్గొననున్నారు.
Irfan Pathan: ఐపీఎల్ ముగిసిన వెంటనే లంక ప్రీమియర్ లీగ్ మొదలు కానుంది. ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఎల్‌పీఎల్‌లో చాలామంది మేటి క్రికెటర్లు పాల్గొననున్నారు. ఆ జాబితాలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ఉన్నాడు. కండీ టస్కర్స్ తరపున ఇర్ఫాన్ పఠాన్ బరిలో దిగనున్నాడు. దీనిపై స్పందించిన పఠాన్ ట్విట్టర్ వేదికగా.. ”ఈ లీగ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా” అని తెలిపాడు. కాగా, కరోనా కారణంగా లంక ప్రీమియర్ లీగ్ ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. దాదాపు నెల రోజుల పాటు జరిగే ఈ లీగ్‌లో స్టార్ ప్లేయర్స్ గేల్, డుప్లెసిస్, ఆఫ్రిది, బ్రాత్‌వైట్‌లు కూడా ఉండనున్నారు.
Also Read:
వైసీపీ సంచలన నిర్ణయం.. నవంబర్ 6 నుంచి ఏపీ వ్యాప్తంగా…
ఏపీలో సోమవారం నుంచి స్కూళ్లు, కాలేజీలు.. మార్గదర్శకాలు ఇవే..