సీబీఐ జేడిగా మనోజ్ శశిధర్ నియామకం..!

తెలుగు రాష్ట్రాలకు, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని సీబీఐ జేడీగా నియమించాలని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా‌ను కోరుతూ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగానే కేంద్రం సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా గుజరాత్‌ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి మనోజ్ శశిధర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేరళకు చెందిన ఈయన గుజరాత్‌లో ఐపీఎస్‌గా సుదీర్ఘ కాలం పని చేశారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలకు ఆయన అత్యంత సన్నిహిత […]

సీబీఐ జేడిగా మనోజ్ శశిధర్ నియామకం..!

Updated on: Jan 18, 2020 | 8:14 AM

తెలుగు రాష్ట్రాలకు, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని సీబీఐ జేడీగా నియమించాలని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా‌ను కోరుతూ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగానే కేంద్రం సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా గుజరాత్‌ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి మనోజ్ శశిధర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేరళకు చెందిన ఈయన గుజరాత్‌లో ఐపీఎస్‌గా సుదీర్ఘ కాలం పని చేశారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలకు ఆయన అత్యంత సన్నిహిత అధికారి.

ఇదిలా ఉంటే సీబీఐ మాజీ జేడి లక్ష్మీనారాయణకు సన్నిహితుడైన హెచ్ వెంకటేష్ సీబీఐ జేడిగా వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న విషయాన్ని వివరిస్తూ విజయసాయిరెడ్డి అమిత్ షా‌కు లేఖ రాశారు. అంతేకాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు తన సన్నిహితులైన వ్యక్తులను సీబీఐలో పెట్టుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కాగా, విజయసాయిరెడ్డి లేఖకు అమిత్ షా వెంటనే స్పందించిన కేంద్ర వ్యవహారాల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.