పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బంగ్లదేశ్ సరిహద్దు రాష్ట్రమైన పశ్చిమబెంగాల్ కూడా రణరంగంగా మారింది. దీంతో ఎల్లుండి జరగాల్సిన ఐపీఎల్ ఆటగాళ్ల వేలం ఉంటుందో లేదోననే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఐతే ఈ ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చింది బీసీసీఐ. బెంగాల్‌లో ఉద్రిక్తతలు ఉన్నా..కోల్‌కతాలో అంత ప్రభావం లేనందున షెడ్యూల్ ప్రకారం ఆక్షన్ ఉంటుందని ప్రకటించింది. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని..ఫ్రాంచైజీ
మొత్తం 971మంది క్రికెటర్లు తమ పేర్లు నమోదు చేసుకోగా 332మందిని షార్ట్ లిస్ట్ చేశాయి ఫ్రాంచైజీలు. వీరిలో 43మంది ఇండియన్ క్రికెటర్స్ కాగా..మిగతావారు విదేశీ ఆటగాళ్లు. ఇక ఎనిమిది ఫ్రాంచైజీలు 73 మందిని మాత్రమే ఎంపిక చేసుకునే అవకాశముంది. దీంతో డిసెంబర్ 19న కోల్‌కతా వేదికగా జరగనున్న2020 ఐపీఎల్ వేలంలో 332 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అత్యధిక రిజర్వ్ ధరను రూ.2 కోట్లుగా నిర్ణయించగా..ఈ కనీస ధరలో భారత క్రికెటర్లెవరూ లేరు. ఆసిస్ టీమ్ నుంచి గ్లెన్ మాక్స్‌వెల్, కమ్మిన్స్, ఇంగ్లాండ్ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్, దక్షిణాఫ్రికా ఆటగాడు డేల్ స్టెయిన్ భారీ ధర పలుకుతారని తెలుస్తోంది. రాబిన్ ఊతప్ప, క్రిస్‌లిన్, ఆరోన్‌ఫించ్, జేసన్‌రాయ్‌కు సైతం మంచి డిమాండ్ ఉంది.