ఐపీఎల్ 17వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. సోమవారం (ఏప్రిల్ 1)న హొం గ్రౌండ్ వాంఖడే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ లోనూ ముంబై చతికిల పడింది. ఈ సీజన్‌లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ముంబైకి ఇది వరుసగా మూడో ఓటమి. రాజస్థాన్ బౌలర్ల ధాటికి ముంబై బ్యాటర్లు బొక్కా బోర్లా పడ్డారు. రోహిత్ శర్మ, నమన్ ధీర్, డెవాల్డ్ బ్రెవిస్ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 34 పరుగులు, తిలక్ వర్మ 32 పరుగులు చేశారు. ఇషాన్ కిషన్ 16 పరుగులు చేశాడు. టిమ్ డేవిడ్ 17 రన్స్ చేశాడు. దీంతో ముంబై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో రియాన్ పరాగ్ వరుసగా రెండో అర్ధ సెంచరీ చేయడంతో రాజస్థాన్ 15.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను అందుకుంది. తద్వారా రాజస్థాన్ హ్యాట్రిక్ విజయాలను పూర్తి చేసింది. అదే సమయంలో ముంబైకి వరుసగా మూడో ఓటమి ఎదురైంది.
సొంత గడ్డపై జరుగుతున్న మ్యాచ్ కావడంతో ముంబై అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియంకు తరలివచ్చారు. రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడతాడని, ముంబై మొదటి విజయం సాధిస్తుందని అభిమానులు ఎదురు చూశారు. కానీ అంతా రివర్స్ అయింది. రోహిత్ ఖాతా కూడా తెరవలేకపోయాడు. ముంబై విషయంలోనూ అదే జరిగింది. ముంబై ఓటమి అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ముంబై ఓటమిలో అందరి బాధ్యత ఉంది. అయితే అభిమానులు మాత్రం హార్దిక్ ను మళ్లీ టార్గెట్ గా చేసుకున్నారు. రోహిత్‌ని తొలగించి హార్దిక్‌ని కెప్టెన్‌గా చేసినందుకు ఇప్పటికే ముంబై అభిమానులు ఇప్పటికే హార్దిక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వాంఖడేలో ఓటమితో అభిమానులు మరింత దూకుడు పెంచారు. ‘హార్దిక్‌ని మళ్లీ గుజరాత్‌కి పంపండి’ అని ఓ అభిమాని చెప్పాడు. రోహిత్ ను కెప్టెన్ చేయండి. మళ్లీ ముంబై గెలుపొందడం ప్రారంభిస్తుంది అని ముంబై మద్దతుదారుడు ట్వీట్ చేశాడు. ఇక రకరకాలగా కామెంట్స్ చేస్తున్నారు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్. మరి వీటిపై ఫ్రాంఛైజీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Good afternoon Angry Mumbai Public reaction on yesterday’s match ! People are angry on hardik Pandya’s Captaincy and they want Rohit Sharma back as captain pic.twitter.com/eEiw0twFrV
— Choudhary Sahab🇮🇳 (@siyol_raj9742) April 2, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.