సాగర తీరాన ముంబై ఇండియన్స్..విత్ ఫ్యామిలీస్

ఇప్పటివరకు ప్రాక్టీస్‌లో చెమటలు చిందించిన ముంబై ప్లేయర్స్  కాస్త గ్యాప్ దొరకడంతో ఎమ్‌రైట్స్ బీచ్ ఫ్యామిలీతో కలిసి తెగ ఎంజాయి చేశారు.

సాగర తీరాన ముంబై ఇండియన్స్..విత్ ఫ్యామిలీస్

Updated on: Sep 09, 2020 | 4:44 PM

ఇప్పటివరకు ప్రాక్టీస్‌లో చెమటలు చిందించిన ముంబై ప్లేయర్స్  కాస్త గ్యాప్ దొరకడంతో ఎమ్‌రైట్స్ బీచ్ లో ఫ్యామిలీతో కలిసి తెగ ఎంజాయి చేశారు. తాజాగా ఆ పోటోలను,  వీడియోలను ముంబై ఇండియన్స్‌ టీమ్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఇప్పుడు అవి ఇంటర్నెట్ లో వైరల్‌గా మారాయి. రోహిత్‌ శర్మ, ధావల్‌ కులకర్ణి, ఆదిత్య థారే, సూర్య కుమార్‌ యాదవ్‌ లాంటి వారి కుటుంబ సభ్యులతో కలిసి బీచ్‌లో సరదాగా గడిపారు. అక్కడే సరదాగా ఫుట్ బాల్ కూడా ఆడారు. కరోనా నిబంధనలను పాటిస్తునే సముద్ర తీరంలో సందడి చేశారు. కాగా సెప్టెంబర్‌ 19న అబుదాబి వేదికగా ముంబై ఇండియన్స్ ,చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ జరగనుంది.