
All Rounder Dwayne Bravo Message: ఐపీఎల్ 2020లో వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో ఎదురు దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. తొడ కండరాల గాయం కారణంగా ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో మొత్తం టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే జట్టును వీడుతున్న వేళ.. అతడు సీఎస్‌కే ఫ్యాన్స్‌కు ఓ సందేశం పంపాడు.
”ఈ సీజన్‌లో మీ అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయాం. కొన్నిసార్లు బెస్ట్ ఇచ్చినప్పటికీ.. ఫలితం కనిపించదు. చెన్నై సూపర్ కింగ్స్‌ను ప్రోత్సహించండి.. సపోర్ట్ చేస్తూనే ఉండండి. మేం ఛాంపియనల్లా, మరింత మెరుగ్గా తిరుగొస్తాం. చెన్నై సూపర్ కింగ్స్ సభ్యులుగా, ఫ్యాన్స్‌గా మనమెంతో గర్వించాలి” అని బ్రావో వీడియో సందేశంలో పేర్కొన్నాడు.
Also Read: చెన్నై వెర్సస్ ముంబై.. సీఎస్‌కేకు ‘డూ ఆర్ డై’..