చెన్నై వెర్సస్ ముంబై.. సీఎస్‌కేకు ‘డూ ఆర్ డై’..

ఐపీఎల్ 13లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ షార్జా వేదికగా తలబడనున్నాయి. ఇప్పటిదాకా టోర్నీలో 9 మ్యాచులు ఆడిన ముంబై..

  • Ravi Kiran
  • Publish Date - 2:51 pm, Fri, 23 October 20

IPL 2020: ఐపీఎల్ 13లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ షార్జా వేదికగా తలబడనున్నాయి. ఇప్పటిదాకా టోర్నీలో 9 మ్యాచులు ఆడిన ముంబై.. ఆరింటిలో విజయం సాధించి మూడో స్థానంలో ఉండగా.. చెన్నై కేవలం మూడు విజయాలు మాత్రమే నమోదు చేసుకుని అట్టడుగు స్థానంలో ఉంది.

చెన్నై రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాలి. టాప్ ఆర్డర్ ఫామ్ కోల్పోవడం.. మిడిల్ ఆర్డర్‌లో సరైన బ్యాట్స్‌మెన్‌ లేకపోవడం సీఎస్‌కే జట్టుకు పెద్ద తలనొప్పిగా మారితే.. ధోని ఫినిషర్‌గా విజృంభించలేకపోవడం ఆ జట్టును తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఇక ఈ టీ20 ఫార్మాటుకు సెట్ కాని కేదార్ జాదవ్ ఇప్పటివరకు జట్టును గెలిపించిన దాఖలాలు లేవు. ఏది ఏమైనా గత మ్యాచులో ధోని ఇకపై యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తామని చెప్పడంతో.. తుది జట్టులోకి ఎవరిని తీసుకుంటారో అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇక ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే.. లోపాలు పెద్దగా లేవు. హిట్ మ్యాన్ తిరిగి ఫామ్‌లోకి వస్తే ఆ జట్టుకు తిరుగుండదని చెప్పాలి. ట్రెంట్ బౌల్ట్, బుమ్రా, రాహుల్ చాహర్, పొలార్డ్ రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో వికెట్లు తీసి ముంబైను రేసులో నిలుపుతున్నారు. బ్యాట్‌తో డికాక్, సూర్యకుమార్ యాదవ్, పొలార్డ్, హార్దిక్ పాండ్యా ఆదరగొడుతున్నారు. మరి ఈ మ్యాచులో చెన్నై గెలిచి నిలుస్తుందో లేదో వేచి చూడాలి.

చెన్నై(అంచనా): సామ్ కరన్, డుప్లెసిస్, వాట్సన్/ రుతురాజ్ గైక్వాడ్, రాయుడు, కేదార్ జాదవ్/జగదీషన్, ధోని, జడేజా, దీపక్ చాహార్, ఠాకూర్, చావ్లా/తాహిర్, హజెల్‌వుడ్‌

ముంబై(అంచనా): రోహిత్ శర్మ, డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, పొలార్డ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, కౌల్టర్‌నైల్‌/పాటిన్సన్, రాహుల్ చాహార్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా