ఒలింపిక్‌ క్రీడలను తిలకించే ప్రేక్షకులకు కూడా కోవిడ్‌ వ్యాక్సిన్‌ ః ఐఓసీ చీఫ్‌ థామస్‌ బాచ్‌

|

Nov 17, 2020 | 11:28 AM

ఒలింపిక్‌ పోటీల నిర్వహణ అంటే మాటలు కాదు.. కరోనా కాలంలో మరీ కష్టం.. జపాన్‌ ఆ భారాన్ని భుజాన వేసుకుంది.. కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకుని అటు క్రీడల నిర్వహణతో పాటుగా

ఒలింపిక్‌ క్రీడలను తిలకించే ప్రేక్షకులకు కూడా కోవిడ్‌ వ్యాక్సిన్‌ ః ఐఓసీ చీఫ్‌ థామస్‌ బాచ్‌
Follow us on

ఒలింపిక్‌ పోటీల నిర్వహణ అంటే మాటలు కాదు.. కరోనా కాలంలో మరీ కష్టం.. జపాన్‌ ఆ భారాన్ని భుజాన వేసుకుంది.. కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకుని అటు క్రీడల నిర్వహణతో పాటుగా జపాన్‌ ప్రజల ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించుకోవాలి.. అందుకే అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.. ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులతో పాటు ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చే క్రీడాభిమానులకు కూడా వ్యాక్సిన్‌ ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది.. స్టేడియంకు వచ్చే ప్రేక్షకులకు కూడా వ్యాక్సిన్‌ తప్పనిసరి చేస్తున్నట్టు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ చెప్పారు. జపాన్‌ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్నామని, క్రీడల నిర్వహణ సమయానికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే క్రీడాకారులందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్‌ తీసుకునేలా చర్యలు తీసుకుంటామని థామస్‌ బాచ్‌ తెలిపారు. జపాన్‌ ప్రధానమంత్రి యోషిహిడో సుగాతో సమావేశమైన తర్వాత బాచ్‌ ఈ నిర్ణయాలను వెల్లడించాడు.. క్రీడాభిమానులకు కూడా వ్యాక్సిన్‌ను తప్పనిసరి చేస్తున్నామని చెప్పారు. దీనివల్ల ప్రేక్షకులు నిర్భయంగా క్రీడాపోటీలను తిలకించవచ్చని తెలిపారు. నిజానికి ఈ ఏడాదే ఒలింపిక్‌ పోటీలు జరగాలి .. కానీ కరోనా కారణంగా పోటీలను వచ్చే ఏడాదికి వాయిదా వేశారు.. జులై 23 నుంచి జరిగే ఈ విశ్వ క్రీడలకు జపాన్‌లోని టోక్యో నగరం ఆతిథ్యమిస్తోంది..