ఐఎక్స్ కేసులో బుధవారం రాత్రి సీబీఐ అరెస్ట్ చేసిన మాజీ కేంద్ర మంత్రి చిదంబరం సుప్రీం కోర్టుకు దాఖలు చేసిన రెండు పిటిషన్లు ఇవాళ విచారణకు రానున్నాయి. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన రెండు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే అరెస్టు చేయడానికి ముందే చిదంబరం అరెస్టు చేయకుండా ఆదేశించాలని ఆ పిటిషన్లో కోర్టును అభ్యర్ధించారు. ఈ మేరకు శుక్రవారం జస్టిస్ భానుమతి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
మరోవైపు సీబీఐ కోర్టు ఆయనకు నాలుగు రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ నేపథ్యంలో చిదంబరం మరో మూడు రోజులపాటు సీబీఐ కోర్టులోనే ఉండనున్నారు.