శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్, సీఎం
శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఏపీ ప్రజలకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు శాంతి, పురోగతి, శ్రేయస్సుతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. సోదరభావం, స్నేహం, సామరస్యత సమాజంలో పెరగాలన్నారు. ప్రజల జీవితాలు సంతోషమయం కావాలని, రాష్ట్రాభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరుతూ ఇరువురు వేర్వేరు ప్రకటనల్లో ప్రజలకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.