చిదంబరానికి ఢిల్లీ కోర్టులో చుక్కెదురు.. మరో 14 రోజులు రిమాండ్..

| Edited By: Pardhasaradhi Peri

Sep 19, 2019 | 4:36 PM

ఐఎన్‌ఎక్స్ మీడియాలో కేసులో తిహార్ జైలులో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి మరోసారి ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. అక్టోబర్ 3 వరకు చిదంబరం జ్యూడీషియల్ కస్టడీ పొడిగిస్తూ కోర్టు తీర్పు నిచ్చింది. చిదంబరం జ్యూడీషియల్ రిమాండ్‌ను పొడిగించాలని సీబీఐ.. స్పెషల్ జడ్జి అజయ్ కుమార్‌ను కోరింది. అయితే చిదంబరం తరపు న్యాయవాది కపిల్ సిబల్ సీబీఐ విజ్ఞప్తిని వ్యతిరేకించారు. తీహార్ జైలులో ఉన్న ఆయనకు రెగ్యులర్ మెడికల్ చెక్‌అప్, పుడ్ డైట్ ఇవ్వాలని కపిల్ సిబల్ […]

చిదంబరానికి ఢిల్లీ కోర్టులో చుక్కెదురు.. మరో 14 రోజులు రిమాండ్..
Follow us on

ఐఎన్‌ఎక్స్ మీడియాలో కేసులో తిహార్ జైలులో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి మరోసారి ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. అక్టోబర్ 3 వరకు చిదంబరం జ్యూడీషియల్ కస్టడీ పొడిగిస్తూ కోర్టు తీర్పు నిచ్చింది. చిదంబరం జ్యూడీషియల్ రిమాండ్‌ను పొడిగించాలని సీబీఐ.. స్పెషల్ జడ్జి అజయ్ కుమార్‌ను కోరింది. అయితే చిదంబరం తరపు న్యాయవాది కపిల్ సిబల్ సీబీఐ విజ్ఞప్తిని వ్యతిరేకించారు. తీహార్ జైలులో ఉన్న ఆయనకు రెగ్యులర్ మెడికల్ చెక్‌అప్, పుడ్ డైట్ ఇవ్వాలని కపిల్ సిబల్ కోర్టును కోరారు. 73 ఏళ్ల వయసు ఉన్న ఆయన వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆయన కోర్టుకు వివరించారు.