Inter Exams 2020: కరోనా అలెర్ట్: ఇంటర్ విద్యార్థులకు కీలక సూచనలు.. మాస్కులతో పరీక్షలు..

|

Mar 05, 2020 | 2:39 PM

Inter Exams 2020: కరోనా వైరస్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు నష్ట నివారణ చర్యలు చేపడుతున్నాయి. ఇక ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ విద్యార్థులకు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీబీఎస్‌ఈ, తెలంగాణ విద్యాశాఖ వేర్వేరుగా రెండు ప్రకటనలను విడుదల చేశాయి. పరీక్షలు మొదలయ్యే ముందుగానే క్లాస్ రూమ్‌లను శుభ్రపరచాలని చెప్పారు. విద్యార్థులు మాస్కులు ధరించి పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతులు ఇచ్చింది. వీలయితే శానిటైజర్లు కూడా […]

Inter Exams 2020: కరోనా అలెర్ట్: ఇంటర్ విద్యార్థులకు కీలక సూచనలు.. మాస్కులతో పరీక్షలు..
Follow us on

Inter Exams 2020: కరోనా వైరస్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు నష్ట నివారణ చర్యలు చేపడుతున్నాయి. ఇక ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ విద్యార్థులకు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీబీఎస్‌ఈ, తెలంగాణ విద్యాశాఖ వేర్వేరుగా రెండు ప్రకటనలను విడుదల చేశాయి.

పరీక్షలు మొదలయ్యే ముందుగానే క్లాస్ రూమ్‌లను శుభ్రపరచాలని చెప్పారు. విద్యార్థులు మాస్కులు ధరించి పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతులు ఇచ్చింది. వీలయితే శానిటైజర్లు కూడా వెంట తెచ్చుకోవచ్చునని స్పష్టం చేసింది. అటు నీళ్ల బాటిల్స్‌ను కూడా వెంట తెచ్చుకునే సౌలబ్యాన్ని కూడా విద్యార్థులకు తెలంగాణ విద్యాశాఖ కల్పించింది. దీనికి ఇన్విజిలేటర్లు, తనిఖీ సిబ్బంది ఎటువంటి అభ్యంతరం చెప్పబోరని వెల్లడించింది. కాగా, ఇన్విజిలేటర్లు దగ్గు, తుమ్ములతో బాధపడుతుంటే.. వారి స్థానంలో వేరొకరిని నియమిస్తామన్నారు. అలాగే స్టూడెంట్స్‌లో ఎవరైనా కూడా దగ్గు, జలుబుతో బాధపడేవారు ఉంటే వాళ్లకు వేరే గదుల్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలంగాణ విద్యాశాఖ స్పష్టం చేసింది.

For More News: 

బిగ్‌బాస్ 3 విజేతపై బీరు సీసాలతో దాడి.. తలకు తీవ్ర గాయాలు..

భార్యకు కరోనా సోకిందని బాత్‌రూమ్‌లో లాక్ చేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే.?

నాలుగు రోజుల్లో అల్లకల్లోలం.. కరోనాను జయించిన కేరళ విద్యార్థిని మనోగతం..

కరోనా ఎఫెక్ట్.. ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పులు.?

టీ20 ప్రపంచకప్: తొలిసారి ఫైనల్‌కు చేరిన టీమిండియా

కీచక ఆటోడ్రైవర్‌ను పట్టించిన దిశ యాప్.. మహిళ సేఫ్..

ఆసుపత్రి నుంచి పారిపోయిన కరోనా పేషెంట్.. డాక్టర్లు పరేషాన్!

కేఎఫ్‌సీ చికెన్ కోసం కరోనా బాధితుల డిమాండ్..?