ఏపీ: ఇంటర్ విద్యలో మార్పులు.. అభిప్రాయాల సేకరణ..

Change In Intermediate Syllabus Opinions From Parents: కరోనా వైరస్ దెబ్బకు అన్ని రంగాలు కుదేలయ్యాయి. ముఖ్యంగా ఈ మహమ్మారి విద్యావ్యవస్థను కోలుకోలేని దెబ్బతీసింది. లాక్ డౌన్ కారణంగా మూతపడిన స్కూల్స్, కాలేజీలు, విద్యాసంస్థలు కారణంగా విద్యార్ధులు భవిష్యత్తు ప్రశ్నార్ధకరంగా మారింది.ఈ క్రమంలోనే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ విద్యారంగాన్ని మాములు స్థితికి తీసుకొచ్చేందుకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. సంచలన మార్పులకు శ్రీకారం చుట్టే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఏపీ ప్రభుత్వం కీలక […]

ఏపీ: ఇంటర్ విద్యలో మార్పులు.. అభిప్రాయాల సేకరణ..

Updated on: Jul 25, 2020 | 8:02 AM

Change In Intermediate Syllabus Opinions From Parents: కరోనా వైరస్ దెబ్బకు అన్ని రంగాలు కుదేలయ్యాయి. ముఖ్యంగా ఈ మహమ్మారి విద్యావ్యవస్థను కోలుకోలేని దెబ్బతీసింది. లాక్ డౌన్ కారణంగా మూతపడిన స్కూల్స్, కాలేజీలు, విద్యాసంస్థలు కారణంగా విద్యార్ధులు భవిష్యత్తు ప్రశ్నార్ధకరంగా మారింది.ఈ క్రమంలోనే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ విద్యారంగాన్ని మాములు స్థితికి తీసుకొచ్చేందుకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. సంచలన మార్పులకు శ్రీకారం చుట్టే దిశగా అడుగులు వేస్తున్నాయి.

ఇందులో భాగంగానే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా సంవత్సరం రూపకల్పన, కాలేజీల పునః ప్రారంభం, పనిదినాలు, సిలబస్ కుదింపు, ఆన్లైన్, ఆఫ్‌లైన్‌ బోధనా విధానాలు, కోర్సుల్లో మార్పులు చేర్పులు వంటి విషయాలపై విద్యార్ధులు, తల్లిదండ్రులు, లెక్చరర్స్, విద్యారంగ నిపుణల దగ్గర నుంచి అభిప్రాయాలు సేకరించాలని భావిస్తోంది. ఆసక్తి గలవారు ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అఫీషియల్ వెబ్‌సైట్‌ ద్వారా వారి అభిప్రాయాలను జులై 31, 2020 సాయంత్రం 5 గంటలలోపు తెలియజేయాలని తెలిపింది. అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని.. ఆ తర్వాత తుది నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేసింది.

Also Read: ‘పేరు’ కోసమే సుశాంత్ ప్రయత్నించాడు..అనురాగ్ కశ్యప్ సంచలన వ్యాఖ్యలు..