AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలీగఢ్‌ ఘటన అమానవీయం: ప్రియాంక గాంధీ

ఉత్తర్‌ప్రదేశ్లోని అలీగఢ్‌లో ఓ చిన్నారి చేతులు విరిచి.. కనుగుడ్లు పెరికి దారుణాతి దారుణంగా హత్య చేసిన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై జాతీయ భద్రతా చట్టం(ఎన్‌ఎస్‌ఏ) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే తాము ఫిర్యాదు చేసినా.. పోలీసులు సరిగా స్పందించకపోవడం వల్లే తమ కూతురి ప్రాణాలు పోయాయని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్న నేపథ్యంలో పోలీసు విభాగం ఒక ఇన్‌స్పెక్టర్‌, […]

అలీగఢ్‌ ఘటన అమానవీయం: ప్రియాంక గాంధీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 07, 2019 | 7:19 PM

Share

ఉత్తర్‌ప్రదేశ్లోని అలీగఢ్‌లో ఓ చిన్నారి చేతులు విరిచి.. కనుగుడ్లు పెరికి దారుణాతి దారుణంగా హత్య చేసిన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై జాతీయ భద్రతా చట్టం(ఎన్‌ఎస్‌ఏ) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే తాము ఫిర్యాదు చేసినా.. పోలీసులు సరిగా స్పందించకపోవడం వల్లే తమ కూతురి ప్రాణాలు పోయాయని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్న నేపథ్యంలో పోలీసు విభాగం ఒక ఇన్‌స్పెక్టర్‌, ముగ్గురు సబ్‌ ఇన్‌స్పెక్టర్లతో పాటు ఓ కానిస్టేబుల్‌ని సస్పెండ్‌ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులు జాహిద్‌, అస్లాం అని వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ అమానవీయ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అనేక మంది రాజకీయ నాయకులు, ప్రముఖులు దీన్ని ఖండించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్పందిస్తూ.. చిన్నారి హత్య తనని తీవ్రంగా కలచివేసిందన్నారు. ‘‘ఉత్తర్‌ప్రదేశ్ అలీగఢ్‌లో జరిగిన చిన్నారి భయంకరమైన హత్య నన్ను తీవ్రంగా కలచివేసింది. ఎవరైనా ఓ చిన్నారి పట్ల ఇంత కిరాతకంగా ఎలా వ్యవహరిస్తారు? ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించకుండా వదిలిపెట్టొద్దు. దోషుల్ని వీలైనంత త్వరగా చట్టం ముందు నిలబెట్టాలి’’ అని రాహుల్‌గాంధీ ట్విటర్‌ వేదికగా తన విచారాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ సైతం ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ‘‘అలీగఢ్‌లో జరిగిన అమాయక చిన్నారి హత్య ఒక అమానవీయ చర్య. ఈ సందర్భంగా ఆ చిన్నారి తల్లిదండ్రులు అనుభవిస్తున్న ఆవేదనను నేను ఊహించలేను’’ అని ట్వీట్‌ చేశారు.

Follow Us
2025లో అట్టర్ ప్లాప్ అయిన సినిమా.. ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్..
2025లో అట్టర్ ప్లాప్ అయిన సినిమా.. ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్..
పెసరపప్పు కోయగూర తింటే మోకాళ్ళు, నడుము నొప్పులు పూర్తిగా మాయం
పెసరపప్పు కోయగూర తింటే మోకాళ్ళు, నడుము నొప్పులు పూర్తిగా మాయం
వేల కోట్ల విలువైన బంగారం అమ్మకాలు! కానీ..
వేల కోట్ల విలువైన బంగారం అమ్మకాలు! కానీ..
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. ఖాళీ స్థలం ఉంటే చాలు.. లక్షల్లో సంపాదన
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. ఖాళీ స్థలం ఉంటే చాలు.. లక్షల్లో సంపాదన
ధోనీ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా క్లాస్ ప్లేయర్..
ధోనీ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా క్లాస్ ప్లేయర్..
శక్తివంతమైన మీసాల హనుమాన్ ఆలయం.. ఒక్కసారి దర్శిస్తే మీ కష్టాలు..
శక్తివంతమైన మీసాల హనుమాన్ ఆలయం.. ఒక్కసారి దర్శిస్తే మీ కష్టాలు..
చికెన్ తిన్న తర్వాత వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకండి.. ఎందుకంటే
చికెన్ తిన్న తర్వాత వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకండి.. ఎందుకంటే
ఈ 5 కూరగాయలను ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? అయితే యమ డేంజర్
ఈ 5 కూరగాయలను ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? అయితే యమ డేంజర్
Weekly Horoscope: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతికి ఛాన్స్..
Weekly Horoscope: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతికి ఛాన్స్..
పాలు త్వరగా పాడవుతున్నాయా.. ఈ చిట్కాలు పాటిస్తే రెండు రోజులైనా..
పాలు త్వరగా పాడవుతున్నాయా.. ఈ చిట్కాలు పాటిస్తే రెండు రోజులైనా..