జవాన్ల కుటుంబాలకు ఇన్ఫోసిస్ భారీ విరాళం

| Edited By: Srinu

Mar 07, 2019 | 7:48 PM

బెంగళూరు: పుల్వామా జిల్లాలో తీవ్రవాదుల దాడికి బలైన అమరవీరుల కుటుంబాలకు ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ విరాళాన్ని ప్రకటించింది. మృతి చెందిన ప్రతి ఒక్క  సైనికుని కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున 40మందికి ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తామని ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు సుధామూర్తి ప్రకటించారు. ఆదివారం ఆమె విరాళాల వివరాలను వెల్లడించారు. ‘బాధితులకు నగదు సాయం అందిస్తున్నట్లు ప్రకటించటం సమంజసం కాదు. ఎంత డబ్బు ఇచ్చినా మరణించిన వారిని తేలేం. యోధులంతా వీర మరణం పొందారు. ఈ సమయంలో నగదు […]

జవాన్ల కుటుంబాలకు ఇన్ఫోసిస్ భారీ విరాళం
Follow us on

బెంగళూరు: పుల్వామా జిల్లాలో తీవ్రవాదుల దాడికి బలైన అమరవీరుల కుటుంబాలకు ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ విరాళాన్ని ప్రకటించింది. మృతి చెందిన ప్రతి ఒక్క  సైనికుని కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున 40మందికి ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తామని ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు సుధామూర్తి ప్రకటించారు. ఆదివారం ఆమె విరాళాల వివరాలను వెల్లడించారు. ‘బాధితులకు నగదు సాయం అందిస్తున్నట్లు ప్రకటించటం సమంజసం కాదు. ఎంత డబ్బు ఇచ్చినా మరణించిన వారిని తేలేం. యోధులంతా వీర మరణం పొందారు. ఈ సమయంలో నగదు ప్రస్తావన రాకూడదు. కానీ సాయం చేయాలనుకున్న వారిలో స్ఫూర్తిని నింపేందుకు, బాధితుల కుటుంబాలకు మేమున్నామని చెప్పేందుకే ఆర్థిక సాయం ప్రకటించాల్సి వస్తోంద’న్నారు.