ఇండియన్ సూపర్ లీగ్ తాజా సీజన్‌లో ముంబై సిటీ ఎఫ్‌సీ దుమ్ములేపుతోంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆ జట్టు వరుసగా నాలుగో విజయాన్ని సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 2-1తో సీఎఫ్‌సీని ఓడగొట్టింది. ఒక గోల్‌తో వెనుకడినప్పటికీ అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించి..తన రేంజ్ చూపించింది. ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించిన చెన్నయిన్.. ప్రత్యర్థికి చుక్కలు చూపించింది. అటాకింగ్ గేమ్ ఆడిన సీఎఫ్‌పీ 40వ నిమిషంలో మొదటి గోల్ చేసింది.
రైట్ ఫ్లాంక్ నుంచి లలియాంజ్వల చాంగ్టే ఇచ్చిన పాస్‌ను జాకుబ్ సిల్వెస్టర్ తన మార్క్ కిక్‌తో నెట్‌లోకి కొట్టడంతో చెన్నయిన్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే.. ఐదు నిమిషాల్లోనే ముంబై స్కోరు లెవల్ చేసింది. మొదటి అర్థభాగం చివర్లో హ్యూగో బౌమస్ కార్నర్ నుంచి బాక్స్‌లోకి తీసుకొచ్చిన బాల్‌ను విశాల్ కైత్ షాట్ కొట్టగా మిస్సయింది. కానీ, బాల్ నెట్ వద్ద అన్‌మార్క్‌గా ఉన్న హెర్నర్ శాంటానా దగ్గర పడగా అతను ఈజీ గోల్ చేశాడు. ఇక రెండో అర్థభాగంలో ఇరు జట్లు పందెంకోళ్లలా తలపడ్డాయి. అయితే 75వ నిమిషంలో ఆడమ్ లెఫొండ్రే హెడ్డర్‌తో రెండో గోల్ చేసిన ముంబై లీడ్‌లోకి వచ్చింది. ఆపై, చివరి వరకూ ఆధిక్యాన్ని నిలుపుకుని..విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
Also Read :
హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు పున:ప్రారంభం, తాగి వాహనం నడిపితే బ్యాండ్ బాజానే
కారులో ఉంచి దర్శనానికి.. ఊపిరాడక చిన్నారులు ఉక్కిరిబిక్కిరి, ఇంతలో హోంగార్డు ఏం చేశాడంటే..?
16 మంది అమ్మాయిలతో బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తా, కెమెరాలు ఉన్నా ఫర్వాలేదు : వర్మ మార్క్ కామెంట్స్