రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్…

|

Sep 10, 2020 | 6:27 PM

 నేటి నుంచి 80 కొత్త రైళ్లకు రిజర్వేషన్ ప్రారంభమైంది.  ఈ నెల 12 నుంచి రైళ్లు తమ ప్రయాణాన్ని ప్రారంభించనున్నాయి. ‌రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించిన 40 జతల ప్రత్యేక రైళ్లకు నేటి నుంచి రిజర్వేషన్ అందుబాటులోకి వచ్చింది.

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్...
Follow us on

నేటి నుంచి 80 కొత్త రైళ్లకు రిజర్వేషన్ ప్రారంభమైంది.  ఈ నెల 12 నుంచి రైళ్లు తమ ప్రయాణాన్ని ప్రారంభించనున్నాయి. ‌రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించిన 40 జతల ప్రత్యేక రైళ్లకు నేటి నుంచి రిజర్వేషన్ అందుబాటులోకి వచ్చింది.

ప్రస్తుతం నడుస్తున్న 230 ప్రత్యేక రైళ్లకు ఈ 80 రైళ్లు అదనమని భారతీయ రైల్వే తొలి సీఈవోగా ఇటీవల నియమితులైన యాదవ్ తెలిపారు. ఈ కొత్త రైళ్ల వేళలు రెగ్యులర్ రైళ్ల మాదిరిగానే ఉంటాయన్నారు. అయితే, స్టాపుల విషయంలో మాత్రం ఆయా రాష్ట్రాలను సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు.

కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు విధించిన లాక్‌డౌన్ కారణంగా మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా ఎక్కడిరైళ్లు అక్కడ నిలిచిపోయాయి. ఆ తర్వాత వలస కార్మికుల కోసం మే 1 నుంచి ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఇప్పుడు తాజాగా, ఢిల్లీ-ఇండోర్, యశ్వంత్‌పూర్-గోరఖ్‌పూర్, పూరి-అహ్మదాబాద్, న్యూఢిల్లీ-బెంగళూరు రూట్లలో కొత్త రైళ్లను చేర్చింది. ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కానీ, యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా కానీ టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది.