AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాపై పోరులో సరికొత్త ఆవిష్కరణ.. భారత సంతతి శాస్త్రవేత్త ఘనత..!

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో కరోనాపై పోరుకు అమెరికాలోని భారత సంతతి శాస్త్రవేత్త

కరోనాపై పోరులో సరికొత్త ఆవిష్కరణ.. భారత సంతతి శాస్త్రవేత్త ఘనత..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 05, 2020 | 5:03 AM

Share

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో కరోనాపై పోరుకు అమెరికాలోని భారత సంతతి శాస్త్రవేత్త డాక్టర్‌ మనుప్రకాశ్‌ సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చారు. విద్యుత్‌ అవసరం లేకుండా పనిచేయగల సెంట్రీఫ్యూజ్‌(అపకేంద్ర యంత్రం)ను మనుప్రకాశ్ నేతృత్వంలోని స్టాన్‌ఫర్డ్‌ వర్సిటీ బయో ఇంజనీరింగ్‌ శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి చేసింది.

కోవిద్-19 నిర్ధారణకు లాలాజల(ఉమ్మి) నమూనాలతో పరీక్షలు చేసేందుకు వాడే యంత్రాల్లో ప్రస్తుతం విద్యుత్‌ ఆధారిత సెంట్రీఫ్యూజ్‌లు ఉన్నాయి. వీటి ధర వందల డాలర్లలో ఉంటుంది. కానీ మనుప్రకాశ్‌ అండ్‌ టీం రూపొందించిన సెంట్రీఫ్యూజ్‌కు కరెంటు అవసరం లేదు. ధర కూడా చాలా తక్కువ. దాన్ని నేరుగా ‘హ్యాండీఫ్యూజ్‌’ పరికరంలో అమర్చి.. దానికి ఉండే హ్యాండిల్‌ను చేతితో తిప్పుతుంటే సెంట్రీఫ్యూజ్‌ వేగంగా తిరుగుతూ లాలాజల నమూనాల్లోని భాగాలను అపకేంద్ర బలంతో వేరుచేస్తుంది.

కాగా.. హ్యాండీఫ్యూజ్‌ పరికరంలో ఒక్క సెంట్రీఫ్యూజ్‌ను అమర్చడానికి రూ.380 కంటే తక్కువే ఖర్చవుతుందని వెల్లడించారు. మారుమూల, గ్రామీణ ప్రాంతాల్లో కరోనా పరీక్షలకు ఈ ఆవిష్కరణ ఊతమిస్తుందని మనుప్రకాశ్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జన్మించిన మనుప్రకాశ్‌.. ఐఐటీ కాన్పూర్‌లో బీటెక్‌, అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఎం.ఎస్‌, పీహెచ్‌డీ చేశారు.

Follow Us
సమ్మర్‌ స్పెషల్..నోరూరించే మామిడికాయ పులిహోర..ఈ సింపుల్ టిప్స్ తో
సమ్మర్‌ స్పెషల్..నోరూరించే మామిడికాయ పులిహోర..ఈ సింపుల్ టిప్స్ తో
వడ్డీ రేట్లపై ప్రకటన చేసిన ఆర్బీఐ.. ఎంతంటే..?
వడ్డీ రేట్లపై ప్రకటన చేసిన ఆర్బీఐ.. ఎంతంటే..?
ప్రేమలో టీమిండియా స్టార్ పేసర్.. ఆ నటితో డేటింగ్..? ఫోటోలు వైరల్
ప్రేమలో టీమిండియా స్టార్ పేసర్.. ఆ నటితో డేటింగ్..? ఫోటోలు వైరల్
అల్లు అర్జున్ ఇంటి వద్ద అభిమానుల సందడి..
అల్లు అర్జున్ ఇంటి వద్ద అభిమానుల సందడి..
వామ్మో.. ఒక్క కోడిగుడ్డు ధర రూ.25,000.. దీని వెనుక ఉన్న సీక్రెట్
వామ్మో.. ఒక్క కోడిగుడ్డు ధర రూ.25,000.. దీని వెనుక ఉన్న సీక్రెట్
ఓరీ దేవుడో ఇదో సైలెంట్ కిల్లర్.. కాటు వేస్తే కాటికే..! ఈ లక్షణాలు
ఓరీ దేవుడో ఇదో సైలెంట్ కిల్లర్.. కాటు వేస్తే కాటికే..! ఈ లక్షణాలు
సెకన్లలోనే కరెంట్ బిల్లు.. సూపర్ స్మార్ట్‌గా మొబైల్‌లోనే..
సెకన్లలోనే కరెంట్ బిల్లు.. సూపర్ స్మార్ట్‌గా మొబైల్‌లోనే..
అన్నంలో వెంట్రుక బంధుత్వానికి సంకేతం కాదు..అనారోగ్యానికి హెచ్చరిక
అన్నంలో వెంట్రుక బంధుత్వానికి సంకేతం కాదు..అనారోగ్యానికి హెచ్చరిక
అల్లు అర్జున్ స్పెషల్ మ్యాష్ అప్ వీడియో అదిరిపోయింది..
అల్లు అర్జున్ స్పెషల్ మ్యాష్ అప్ వీడియో అదిరిపోయింది..
పేరుకే పెద్ద ప్లేయర్లు.. తొలివారంలోనే తేలిపోయిన తోపులు..
పేరుకే పెద్ద ప్లేయర్లు.. తొలివారంలోనే తేలిపోయిన తోపులు..