భారత హాకీ జట్టులో కరోనా కలకలం.. కెప్టెన్‌తో పాటు నలుగురికి పాజిటివ్..

భారత హాకీ జట్టులో కరోనా కలకలం.. కెప్టెన్‌తో పాటు నలుగురికి పాజిటివ్..

భారత పురుషుల హాకీ టీమ్‌లో కరోనా కలకలం రేగింది. కెప్టెన్‌తో పాటు నలుగురి ఆటగాళ్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

Ravi Kiran

|

Aug 08, 2020 | 5:14 PM

Manpreet Singh Tests Corona Positive: కరోనా మహమ్మారి ఎవరిని వదలట్లేదు. సామాన్యుల దగ్గర నుంచి రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, క్రికెటర్లు ఇలా అందరూ కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇక ఇప్పుడు తాజాగా భారత పురుషుల హాకీ టీమ్‌లో కరోనా కలకలం రేగింది. కెప్టెన్‌తో పాటు నలుగురి ఆటగాళ్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నెల రోజుల వ్యవధి తర్వాత వారి స్వస్థలాల నుంచి వీరందరూ కూడా బెంగళూరులోని భారత స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌) కేంద్రంలో ఏర్పాటు చేసిన జాతీయ శిక్షణ శిబిరానికి హాజరు కాగా.. అక్కడ కోవిడ్ టెస్టులు నిర్వహించడంతో వీరికి పాజిటివ్ వచ్చింది. దీనితో ఈ ఆటగాళ్లు ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నారు.

”ప్రస్తుతం తాను స్వీయ నిర్బంధంలో ఉన్నానని.. ఆరోగ్యంగానే ఉన్నట్లు కెప్టెన్ మన్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపాడు. ‘సాయ్’ వర్గాల చర్యలు బాగున్నాయని.. డాక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని అతడు స్పష్టం చేశాడు. స్వస్థలాల నుంచి బెంగళూరుకు వచ్చే క్రమంలో వీరికి కరోనా సోకి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. మన్‌ప్రీత్‌తో పాటు మరో పది మందికి ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షలు చేయగా.. ఇంకా కొంతమంది ఆటగాళ్ల ఫలితాలు రావాల్సి ఉంది.

Also Read: ‘అల దుబాయ్’లో డేవిడ్ భాయ్.. పోరుకు సిద్ధం.!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu