ఆర్మీ డే సందర్భంగా భారత సైన్యానికి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీ.రామారావు శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఇండియన్ ఆర్మీకి ఆయన సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. మనం ప్రకృతి వైపరీత్యాలలో ఉన్నప్పుడు మనల్ని కాపాడుతారు. మన దేశం యొక్క స్వేచ్ఛ కోసం సైనికులు ఎలప్పుడూ రక్షణగా ఉంటారు. ఇండియన్ ఆర్మీ ధైర్య సాహసాలను ఎప్పటికీ మరువలేనివన్నారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా సైనికుల త్యాగాలకు, వారి కుటుంబాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ కేటీఆర్ ట్వీట్ వేదికగా షేర్ చేశారు.
They are here to rescue when we are struck with natural disasters. They are always on guard to protect our nation’s freedom
My wholehearted salute & gratitude to the brave soldiers of Indian Army & their families who make us proud with their valour & sacrifices ?#ArmyDay
— KTR (@KTRTRS) January 15, 2021