AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉగ్రదాడుల ఘటనకు 2 గంటల ముందే శ్రీలంకను హెచ్చరించిన భారత్

శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. చర్చిలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ పేలుళ్లలో 321 మంది మృతిచెందారు… 500 మంది గాయపడ్డారు. ఈస్టర్ పండుగను పురస్కరించుకుని చర్చిలో ప్రార్థనలకు వచ్చినవారే లక్ష్యంగా ముష్కరులు దాడులకు తెగబడ్డారు. మొత్తం ఎనిమిది చోట్ల బాంబు పేలుళ్లు జరిగినట్టు పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటన చోటుచేసుకునే ముందే తీవ్రవాదులు దాడి చేయబోతున్నట్లు శ్రీలంక నిఘా అధికారులను భారత గూఢచార అధికారులు హెచ్చరించారు. ఎటువంటి సాక్ష్యం […]

ఉగ్రదాడుల ఘటనకు 2 గంటల ముందే శ్రీలంకను హెచ్చరించిన భారత్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 23, 2019 | 9:44 PM

Share

శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. చర్చిలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ పేలుళ్లలో 321 మంది మృతిచెందారు… 500 మంది గాయపడ్డారు. ఈస్టర్ పండుగను పురస్కరించుకుని చర్చిలో ప్రార్థనలకు వచ్చినవారే లక్ష్యంగా ముష్కరులు దాడులకు తెగబడ్డారు. మొత్తం ఎనిమిది చోట్ల బాంబు పేలుళ్లు జరిగినట్టు పోలీసు అధికారులు తెలిపారు.

ఈ ఘటన చోటుచేసుకునే ముందే తీవ్రవాదులు దాడి చేయబోతున్నట్లు శ్రీలంక నిఘా అధికారులను భారత గూఢచార అధికారులు హెచ్చరించారు. ఎటువంటి సాక్ష్యం లేకుండానే ఐసిస్ మంగళవారం ఈ దాడులకు బాధ్యత వహించింది.

మొదటి దాడికి రెండు గంటల ముందు భారత నిఘా అధికారులు శ్రీలంక ప్రతినిధులను సంప్రదించారు.శనివారం రాత్రి కూడా భారత అధికారుల నుంచి ఒక హెచ్చరిక వచ్చిందని శ్రీలంక వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 4… ఏప్రిల్ 20 న కూడా శ్రీలంక నిఘా ఏజెంట్లకు ఇదే విధమైన సందేశాలు ఇవ్వబడ్డాయి. అయితే శ్రీలంక ప్రభుత్వం… భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి కూడా ఎటువంటి స్పందన లభించలేదు.

Follow Us
బాలీవుడ్ నటి కన్నమూత.. క్యాన్సర్‌తో పోరాడి చివరకు.
బాలీవుడ్ నటి కన్నమూత.. క్యాన్సర్‌తో పోరాడి చివరకు.
ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభవార్త.. ఫీజులు తగ్గింపు
ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభవార్త.. ఫీజులు తగ్గింపు
చెన్నైలో బీబీఎల్.. క్రికెట్ ఆస్ట్రేలియా మాస్టల్ ప్లాన్..?
చెన్నైలో బీబీఎల్.. క్రికెట్ ఆస్ట్రేలియా మాస్టల్ ప్లాన్..?
బంగారం,వెండి కొనే వారికి బంపర్ గుడ్‌న్యూస్.. భారీగా కుదేలు!ఎంతంటే
బంగారం,వెండి కొనే వారికి బంపర్ గుడ్‌న్యూస్.. భారీగా కుదేలు!ఎంతంటే
20 కిలోల బంగారు నగలు ధరించిన హీరోయిన్..
20 కిలోల బంగారు నగలు ధరించిన హీరోయిన్..
చేపల వాసనతో ఇబ్బందా.. ఇలా శుభ్రం చేస్తే క్షణాల్లో స్మెల్‌ మాయం!
చేపల వాసనతో ఇబ్బందా.. ఇలా శుభ్రం చేస్తే క్షణాల్లో స్మెల్‌ మాయం!
ప్రపంచంలోని ఈ నాలుగు ప్రదేశాల్లో బంగారం ఫ్రీ! 2 మన భారతదేశంలోనే..
ప్రపంచంలోని ఈ నాలుగు ప్రదేశాల్లో బంగారం ఫ్రీ! 2 మన భారతదేశంలోనే..
ప్రశాంత్ వర్మ 'జై హనుమాన్'లో రాముడిగా ఆ టాలీవుడ్ స్టార్ హీరో!
ప్రశాంత్ వర్మ 'జై హనుమాన్'లో రాముడిగా ఆ టాలీవుడ్ స్టార్ హీరో!
పీఎం కిసాన్ మీకు వస్తాయో.. లేదో.. క్షణాల్లోనే ఇలా తెలుసుకోండి
పీఎం కిసాన్ మీకు వస్తాయో.. లేదో.. క్షణాల్లోనే ఇలా తెలుసుకోండి
మృత్యుంజయుడే.. ఒకేరోజు చావు అంచుల వరకు వెళ్లిన కమల్..
మృత్యుంజయుడే.. ఒకేరోజు చావు అంచుల వరకు వెళ్లిన కమల్..