భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పైనల్ మ్యాచ్ నాలుగో రోజు ఆట రద్దు అయింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో రెండు సెషన్ల పాటు ఎదురు చూసినా వాతావరణంలో ఎలాంటి మార్పూ కనిపించలేదు నాలుగో రోజు ఆటను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం మరోసారి మైదాన పరిస్థితులను గమనించిన అంపైర్లు నాలుగో రోజు స్టంప్స్ ప్రకటించారు. దాంతో తొలి రోజు లాగే నేడూ ఆట ఒక్క బంతి పడకుండానే రద్దు అయింది.
మరోవైపు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులు చేయగా న్యూజిలాండ్ మూడో రోజు ఆట నిలిచే సమయానికి 101/2 స్కోర్‌తో నిలిచింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్(12), రాస్‌టేలర్(0) క్రీజులో ఉన్నారు. అంతకుముందు కివీస్ ఓపెనర్లు టామ్ లాథమ్(30), డెవాన్ కాన్వే(54) శుభారంభం చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించారు.
ఈ క్రమంలోనే అశ్విన్ లాథమ్‌ను ఔట్ చేయగా, కాన్వే అర్ద సెంచరీ తర్వాత ఇషాంత్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కన్నా 116 పరుగుల వెనుకంజలో నిలిచింది. మరోవైపు రిజర్వ్‌డేతో కలిపి ఇంకా రెండు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉంది. దాంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే భారత్, న్యూజిలాండ్ ఇరు జట్లు ట్రోఫీని పంచుకునే వీలుంది.
It’s been that kind of a day ☔️☔️#WTC21 pic.twitter.com/1PUaUbcddQ
— BCCI (@BCCI) June 21, 2021