ఇండియా-ఆస్ట్రేలియా సిరీస్: సచిన్ రికార్డును బ్రేక్ చేయనున్న విరాట్ కోహ్లీ…
మరో వారం రోజుల్లో ఇండియా-ఆస్ట్రేలియా సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నవంబర్ 27వ తేదీన...
India Vs Australia 2020: మరో వారం రోజుల్లో ఇండియా-ఆస్ట్రేలియా సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నవంబర్ 27వ తేదీన ఇరు జట్ల మధ్య సిడ్నీ వేదికగా తొలి వన్డే జరగనుంది. ఇక ఈ సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సచిన్ రికార్డును బద్దల కొట్టబోతున్నాడు.
వన్డేల్లో మరో 133 పరుగులు చేయడంతో కోహ్లీ 12,000 పరుగుల మైలురాయిని అందుకుంటాడు. ఇప్పటివరకు కోహ్లీ 239 ఇన్నింగ్స్ ఆడి 11,867 పరుగులు చేశాడు. అటు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 12 వేల పరుగుల మెయిలు రాయిని 300 ఇన్నింగ్స్‌లో అందుకున్నాడు. దీని బట్టి చూస్తే విరాట్ కోహ్లీ సచిన్ రికార్డును బద్దలకొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ జాబితాలో ఆస్ట్రేలియా లెజండరీ బ్యాట్స్‌మెన్ పాంటింగ్ 314 ఇన్నింగ్స్‌తో, సంగక్కర 336, జయసూర్య 379, జయవర్ధనే 399 ఇన్నింగ్స్‌లతో ఆ తర్వాత ఉన్నారు. అంతేకాకుండా కోహ్లీ మరో రెండు సెంచరీలు చేస్తే అత్యధిక శతకాల బాదిన వీరుల లిస్టులో రెండోస్థానానికి ఎగబాకుతాడు. ఇప్పటిదాకా సచిన్(100 సెంచరీలు), పాంటింగ్(71 సెంచరీల)తో మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.