ఆస్ట్రేలియాతో జరగబోయే టీ20లకు బుమ్రా, షమీలకు రెస్ట్..? కారణమిదే.!

|

Nov 19, 2020 | 1:51 PM

ఐపీఎల్ 2020 ముగిసింది. మరికొన్ని రోజుల్లో ఇండియా-ఆస్ట్రేలియా మధ్య సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్లూ సిడ్నీలో ప్రాక్టిస్‌లు చేస్తున్నాయి.

ఆస్ట్రేలియాతో జరగబోయే టీ20లకు బుమ్రా, షమీలకు రెస్ట్..? కారణమిదే.!
Follow us on

ఐపీఎల్ 2020 ముగిసింది. మరికొన్ని రోజుల్లో ఇండియా-ఆస్ట్రేలియా మధ్య సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్లూ సిడ్నీలో ప్రాక్టిస్‌లు చేస్తున్నాయి. బయోబబుల్ బడుగలో ఆటగాళ్లు కఠోర సాధన చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాతో జరగబోయే టీ20లకు బౌలర్లు జస్ప్రిత్ బుమ్రా, మహమ్మద్ షమీలకు రెస్ట్ ఇవ్వాలని జట్టు యాజమాన్యం భావిస్తోందట.

టెస్ట్ సిరీస్‌కు ముందు తగినంత ప్రాక్టీస్ ఉండాలన్న నేపధ్యంలో తొలి రెండు టీ20లకు షమీ, బుమ్రాలకు విశ్రాంతిని ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాగా, వారి స్థానంలో టీ20లకు దీపక్ చాహార్, నటరాజన్, సైనీలు బరిలోకి దిగే అవకాశం ఉంది. కాగా, ఇండియా-ఆస్ట్రేలియా సిరీస్ ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో ఇరు జట్లు మూడు వన్డేలు, మూడు టీ20లు, ఐదు టెస్టులు ఆడనున్నాయి.

Also Read: 

పింఛన్‌దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆ పింఛన్‌ను రెండు విడతలుగా చెల్లించేందుకు.!

జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఈ నెల 25న వారి ఖాతాల్లోకి రూ. 10 వేలు జమ.!

ఏపీ ప్రజలకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. పంచారామాలకు 1,750 స్పెషల్ బస్సులు..