Hitman Rohit Sharma: ఆసీస్ గడ్డపై అత్యధిక సిక్సర్ల వీరుడు.. హిట్‌మ్యాన్ ఖాతాలో మరో అరుదైన రికార్డు.!

Hitman Rohit Sharma: టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన ఖాతాలో అరుదైన రికార్డును అందుకున్నాడు. ఆసీస్ గడ్డపై...

Hitman Rohit Sharma: ఆసీస్ గడ్డపై అత్యధిక సిక్సర్ల వీరుడు.. హిట్‌మ్యాన్ ఖాతాలో మరో అరుదైన రికార్డు.!

Updated on: Jan 10, 2021 | 9:18 PM

Hitman Rohit Sharma: టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన ఖాతాలో అరుదైన రికార్డును అందుకున్నాడు. ఆసీస్ గడ్డపై అన్ని ఫార్మాట్లలో కలిపి 50 సిక్సర్లు బాదిన తొలి విదేశీ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. రోహిత్ శర్మ అగ్రస్థానంలో నిలవగా.. విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్(45), క్రిస్ గేల్(35), షాహిద్ అఫ్రిది(32)లు తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఓ సిక్స్ బాదిన రోహిత్ శర్మ ఆస్ట్రేలియాపై మొత్తం 100 సిక్సర్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.

కాగా, ప్రస్తుతం ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో రోహిత్ శర్మ టీమిండియాకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే ఔట్ అయినా.. రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీతో అదరగొట్టాడు.