- Telugu News Latest Telugu News India Travel special : You will able to enjoy rising sun at these places in India these are famous sunrise points in telugu
Travel special: ప్రకృతి అందాల నడుమ సూర్యోదయాన్ని వీక్షించాలనుకుంటున్నారా.. ఈ ప్రదేశాలు బెస్ట్ ఎంపిక
India Travel special :మీరు ఉదయించే సూర్యుడిని చూడటానికి ఎక్కడికైనా వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే, భారతదేశంలో సూర్యోదయాన్ని చూడడానికి అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి.
Updated on: Apr 30, 2022 | 8:58 PM

సూర్యుని ఉదయించే కిరణాలు జీవితాన్ని సానుకూలత వైపు తీసుకుని వెళ్తాయి. ఉదయించే సూర్యుడిని చూడటానికి అందరూ ఇష్టపడతారు. అందమైన ప్రకృతి దృశ్యాల మధ్య ఉదయించే సూర్యుని దృశ్యాన్ని చూడటం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉదయించే సూర్యుడిని చూడడానికి మంచి ప్రదేశాల గురించి ఈ రోజు తెలుసుకుందాం .

భారతదేశంలో సూర్యోదయాన్ని చూడడానికి పూరీ ప్రత్యేక ప్రదేశం. ఇక్కడ సముద్రం మంచి గమ్యస్థానం. ఇక్కడ చిలికా సరస్సు మధ్య సూర్యోదయాన్ని చూడడం అద్భుతమైన క్షణాలుగా పరిగణిస్తున్నారు.

వారణాసి అతిపురాతన నగరం. ఆధ్యాత్మిక క్షేత్రం. ఇక్కడ గంగానది ఒడ్డున ఉదయించే సూర్యుడిని చూడటం ఒక ఆహ్లాదకరమైన అనుభూతి. ప్రతి ఒక్కరూ ఈ దృశ్యాన్ని చూసి తీరాల్సిందే..

మౌంట్ అబూ రాజస్థాన్‌లో ఉన్న ఒక అందమైన నగరం. ఈ ప్రదేశాన్ని సందర్శించేందుకు ప్రజలు ఎక్కువగా వెళ్తుంటారు. ఇక్కడ ప్రసిద్ధి చెందిన నక్కి సరస్సు నుండి ఉదయించే సూర్యుడిని చూడటం ఒక భిన్నమైన ఆనందాన్ని కలుగజేస్తుంది.

కేరళలోని కోవలం అందాలు ప్రత్యేకం. ఈ ప్రదేశం అందమైన బీచ్‌లకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఒక్కసారి కూడా పైకి లేచే ఉదయించే సూర్యుడిని చూస్తే ఆ అనుభూతిని మరల మరచిపోలేరు.

టైగర్ హిల్స్ డార్జిలింగ్‌లో ఉంది. ఎవరెస్ట్ తర్వాత హిమాలయాల్లో అత్యంత ఎత్తైన శిఖరాలలో ఒకటైన కాంచన్‌జంగా కొండల వెనుక నుండి సూర్యుడు ఉదయించడాన్ని ప్రతి ఒక్కరూ చూడాలనుకుంటున్నారు. ఈ దృశ్యాన్ని ఒక్కసారైనా జీవితంలో చూడాల్సిందే.




