ఐరాస వేదికగా మోదీపై ఇమ్రాన్ వివాదాస్పద వ్యాఖ్యలు

| Edited By:

Sep 27, 2019 | 10:14 PM

ఐక్యరాజ్యసమితి వేదికగా పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కారు. కశ్మీర్‌ అంశాన్ని మరోసారి లేవనెత్తారు. కశ్మీర్‌లో కర్ఫ్యూ విధించి ప్రజల్ని బంధీలను చేశారని ఆరోపించారు. ఒక్కసారి కర్ఫ్యూ ఎత్తివేస్తే జరిగేది రక్తపాతమేనని హెచ్చరించారు. ఒకవేళ యుద్ధమంటూ వస్తే తాము చూస్తూ ఊరుకోబోమని, చివరి వరకు పోరడతామన్నారు. అణ్వస్త్రాలు కలిగిన దేశాల మధ్య యుద్ధం వస్తే అది రెండు దేశాలకే పరిమితం కాదన్నారు. ఈ పరిస్థితి రాకుండా చూడాల్సింది ఐరాసనే అని ఇమ్రాన్‌ అన్నారు. […]

ఐరాస వేదికగా మోదీపై ఇమ్రాన్ వివాదాస్పద వ్యాఖ్యలు
Follow us on

ఐక్యరాజ్యసమితి వేదికగా పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కారు. కశ్మీర్‌ అంశాన్ని మరోసారి లేవనెత్తారు. కశ్మీర్‌లో కర్ఫ్యూ విధించి ప్రజల్ని బంధీలను చేశారని ఆరోపించారు. ఒక్కసారి కర్ఫ్యూ ఎత్తివేస్తే జరిగేది రక్తపాతమేనని హెచ్చరించారు. ఒకవేళ యుద్ధమంటూ వస్తే తాము చూస్తూ ఊరుకోబోమని, చివరి వరకు పోరడతామన్నారు. అణ్వస్త్రాలు కలిగిన దేశాల మధ్య యుద్ధం వస్తే అది రెండు దేశాలకే పరిమితం కాదన్నారు. ఈ పరిస్థితి రాకుండా చూడాల్సింది ఐరాసనే అని ఇమ్రాన్‌ అన్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఇమ్రాన్‌ ఖాన్‌ సుదీర్ఘంగా ప్రసంగించారు. భారత్‌పై తన అక్కసు వెళ్లగక్కుతూనే ఇస్లామిక్‌ వాదాన్ని లేవనెత్తారు.

”ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్‌ ఫోబియా పెరుగుతోంది. సెప్టెంబర్ 9/11 దాడుల తర్వాత ఇది పెరిగింది. కొందరు నేతలు ఉగ్రవాదాన్ని ముస్లిం మతంతో ముడిపెట్టారు. మతానికి టెర్రరిజానికి సంబంధం లేదు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ముస్లింలను అతివాదులుగా ముద్రవేశాయి. ముస్లింలను ఆత్మాహుతి దళ సభ్యులుగా ముద్రవేస్తున్నారు. సెప్టెంబర్‌ 11 దాడులకు ముందు ఆత్మాహుతి దాడులు చేసేవారు తమిళ హిందువులే. ఆ రోజుల్లో హిందువులపై ఎవరూ ఉగ్రవాదులగా ముద్రవేయలేదు. సెప్టెంబర్‌ 11 దాడుల్లో మేం పాల్గొనకపోయినా 70 వేల మంది పాకిస్థానీయులు చనిపోయారు” అని ఇమ్రాన్‌ అన్నారు.

”కశ్మీర్‌లో ఉగ్రవాదం గురించి మోదీ మాట్లాడారు. బలూచిస్థాన్‌లో భారత గూఢచర్యం గురించి నేను చెప్పాను. పుల్వామా దాడి తర్వాత ఆధారాలు చూపాలని అడిగా. ఇవన్నీ పక్కనపెట్టి చర్చలు జరుపుదామంటే మోదీ నుంచి స్పందన రాలేదు. సర్జికల్‌ స్ట్రయిక్‌లో 300 మందిని చంపామని మోదీ అన్నారు. కొన్ని చెట్లు మాత్రమే కూలిపోయాయి. వాటిని మేం పెంచుతున్నాం. ఇదంతా ట్రైలరే అని ఎన్నికల సమయంలో మోదీ చెప్పారు. ఎన్నికల తర్వాత భారత్‌లోని పరిస్థితి మారుతుందని ఆశించా. కానీ అందుకు భిన్నంగా కశ్మీర్‌కు ప్రత్యేకప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేశారు. 80 లక్షల మంది ప్రజలను కర్ఫ్యూలో ఉంచారు. భారీ స్థాయిలో బలగాలను మొహరించారు. 55 రోజులుగా కశ్మీర్‌ ప్రజలను బంధించారు. ఒక్కసారి కర్ఫ్యూని ఎత్తివేస్తే జరిగేది రక్తపాతమే. కశ్మీర్‌ ప్రజలను జంతువుల్లా చూస్తున్నారు. 9 లక్షల మంది సైనికులను సరిహద్దులో ఉంచితే మేం 500 మందిని ఎందుకు పంపిస్తాం? మరో దాడి జరిగితే భారత్‌ మళ్లీ నిందించేది మమ్మల్నే. ఇన్నాళ్లు మీరు బంధించాక కర్ఫ్యూను ఎత్తివేస్తే అక్కడి యువత తుపాకీ పట్టక మరేం చేస్తుంది. మీరే ప్రజల్ని ఉగ్రవాదులుగా మారుస్తున్నారు. ఒకవేళ రెండు అణ్వస్త్ర దేశాలు పోరాడితే ఆ యుద్ధం రెండు దేశాలకు మాత్రమే పరిమితం కాబోదు. ఇలాంటి పరిస్థితులే నివారించడానికి ఐక్యరాజ్యసమితి పుట్టింది అని తెలిపారు.