స్ట్రెయిన్‌తో అప్రమత్తమైన కేంద్రం.. అంతర్జాతీయ విమనాలపై అంక్షలు.. జనవరి 31 వరకు పొడిగింపు

అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలను జనవరి 31వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర పౌరవిమానయాన శాఖ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీసీఏ) తెలిపింది.

స్ట్రెయిన్‌తో అప్రమత్తమైన కేంద్రం.. అంతర్జాతీయ విమనాలపై అంక్షలు..  జనవరి 31 వరకు పొడిగింపు

Edited By:

Updated on: Dec 31, 2020 | 6:15 AM

Suspension Of International Flights: కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ కేసులు దేశంలో వెలుగుచూస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలను మరోసారి పొడిగించింది. కరోనా విజృంభిస్తున్న సమయంలో లాక్‌డౌన్ కారణంగా మార్చి 23 నుంచి అన్ని విమాన సర్వీసులను కేంద్రం రద్దు చేసింది. జూన్‌ 6న మళ్లీ పొడిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలను మరోసారి జనవరి 31వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర పౌరవిమానయాన శాఖ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీసీఏ) తెలిపింది. జనవరి 31 వరకు అన్ని అంతర్జాతీయ విమాన రాకపోకలపై ఆంక్షలు విధించింది. అయితే, ప్రత్యేకించి అత్యవసరమైన నిర్దేశించిన మార్గాల్లోనే అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతిస్తున్నట్టు డీజీసీఏ బుధవారం జారీచేసిన సర్క్యులర్‌లో పేర్కొంది. కార్గో విమాన సేవల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది.

అయితే, వందేభారత్‌ మిషన్‌ కింద మే నుంచి ప్రత్యేక విమానాలను నడిపిన విమానయాన శాఖ.. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను సొంత దేశానికి చేరవేసింది. ఆ తర్వాత అమెరికా, యూకే, యూఏఈ, కెన్యా, భూటాన్‌, ఫ్రాన్స్‌ సహా 24 దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా జూలై నుంచి ఎంపిక చేసిన రూట్‌లలో ప్రత్యేక విమాన సర్వీసులను నడుపుతున్నారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. బ్రిటన్‌లో వెలుగుచూసిన కరోనా కొత్తరకం వైరస్‌ స్ట్రెయిన్ భారత్‌లోకి ప్రవేశించడంతో కేంద్రం అప్రమత్తమైంది. మరోసారి అంక్షలు అమలు చేయనున్నట్లు వెల్లడించింది.

ఇదీ చదవండి..

ఇస్రో ఛైర్మన్‌గా కొనసాగనున్న శివన్.. మరో ఏడాదిపాటు పదవీకాలం పొడిగిస్తూ కేంద్రం ఆమోదం