ఇస్రో ఛైర్మన్‌గా కొనసాగనున్న శివన్.. మరో ఏడాదిపాటు పదవీకాలం పొడిగిస్తూ కేంద్రం ఆమోదం

భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) చైర్మన్ కే.శివన్ పదవీకాలం మరో ఏడాదిపాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇస్రో ఛైర్మన్‌గా కొనసాగనున్న శివన్.. మరో ఏడాదిపాటు పదవీకాలం పొడిగిస్తూ కేంద్రం ఆమోదం
Follow us

|

Updated on: Dec 31, 2020 | 5:30 AM

భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) చైర్మన్ కే.శివన్ పదవీకాలం మరో ఏడాదిపాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్ నియామక కమిటీ బుధవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇస్రో చైర్మన్‌గా కే శివన్ జనవరి 14 2022కు పెంచుతున్నట్లు వెల్లడించింది. దీంతో ఇస్రో చైర్మన్‌గా, స్పేస్ డిపార్ట్‌మెంట్ సెక్రెటరీగా మరో ఏడాదికాలం శివన్ కొనసాగన్తు ఆమోదం తెలిపింది. ఏకే కిరణ్ కుమార్ తర్వాత 2018 జనవరి 14న శివన్ చైర్మన్ బాధ్యతలు తీసుకున్నారు. శివన్ ఇస్రో చైర్మన్ తోపాటు కార్యదర్శిగా కొనసాగుతారు.

ఇస్రో చంద్రయాన్-2 ప్రయోగంలో శివన్ ముఖ్య భూమిక పోషించారు. చంద్రయాన్-2 ల్యాండింగ్ సమయంలో సిగ్నల్ అందడం ఆగిపోయింది. విక్రమ్ రోవర్ చంద్రుడిపై దిగిందా లేదా, అసలు దానికి ఏమైంది అనే ప్రశ్నలకు సమాధానాలే లేకుండా పోయాయి. చంద్రయాన్-2 యాత్ర పూర్తి కాకపోవడంపై భావోద్వేగానికి గురైనా శివన్ ప్రధాని మోదీ ప్రశంసలు సైతం అందుకున్నారు. అలాగే, తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే అంశంలో భారత్ ఇప్పుడు ఎన్నో దేశాలకు ఒక గమ్యంగా మార్చడంలో శివన్ పాత్ర కీలకమైంది. మంగళ్ మిషన్ కోసం తక్కువ ఖర్చుతో పీఎస్ఎల్వీ ప్రయోగ వ్యూహాన్ని అభివృద్ధి చేయడంలో కూడా శివన్ కీలక పాత్ర పోషించారు. 2017 ఫిబ్రవరి 15న పీఎస్ఎల్వీ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను(బాహుబలి) విజయవంతంగా అంతరిక్షంలో ప్రయోగించడంలో విజయవంతం కావడం వెనుక డాక్టర్ కె శివన్ ప్రశంసనీయం.