Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుమ్రాపై వేటు.. ఆ ఇద్దరికీ ఛాన్సు.. కోహ్లీ ఆలోచన సరైనదేనా.?

కివీస్‌తో జరగనున్న రెండో టెస్టులో భారత్ కీలక మార్పులుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై వేటు పడే అవకాశం కనిపిస్తోంది. అతని స్థానంలో ఉమేష్ యాదవ్‌ను తీసుకోనున్నారట. అలాగే జడేజా, గిల్, సాహాలు కూడా జట్టులోకి రానున్నట్లు సమాచారం...

బుమ్రాపై వేటు.. ఆ ఇద్దరికీ ఛాన్సు.. కోహ్లీ ఆలోచన సరైనదేనా.?
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 28, 2020 | 3:41 PM

IND Vs NZ: న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన భారత్ రెండు టెస్టులో గట్టి పోటీనివ్వాలని ఆశిస్తోంది. టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఓటమెరుగని కోహ్లీసేన భారీ అంచనాల నడుమ కివీస్‌తో మొదటి టెస్ట్ ఆడిన సంగతి తెలిసిందే. అయితే బ్యాటింగ్, బౌలింగ్‌లో పేలవమైన ప్రదర్శన కనబరచి కివీస్‌కు సరైన పోటీని కూడా ఇవ్వలేకపోయింది. ఈ నేపథ్యంలో రేపు క్రైస్ట్‌చర్చ్ వేదికగా ప్రారంభమయ్యే రెండో టెస్టులో కోహ్లీసేన పలు కీలక మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

అంచనాలను అందుకోలేకపోతున్న స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలనే ఆలోచనలో టీమ్ మేనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. గాయం నుంచి కోలుకున్నాక బుమ్రా లయ తప్పిందనే చెప్పాలి. వన్డే సిరీస్‌లో ధారాళంగా పరుగులు ఇవ్వడమే కాకుండా మొదటి టెస్టులో కూడా 27 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీశాడు.

స్వదేశంలో జరగబోయే సఫారీ సిరీస్ కోసం అతనికి విశ్రాంతిని ఇవ్వాలని యోచిస్తున్నారట. అతని స్థానంలో పేసర్ ఉమేష్ యాదవ్‌ను తీసుకునే అవకాశం ఉంది. అలాగే పృథ్వీ షా, రిషబ్ పంత్, హనుమ విహారీలపై కూడా వేటు పడే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. మరి బుమ్రాను తీసేయడంతో పేసర్లపై అధిక భారం పడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి.