AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AFG: ఆఫ్ఘాన్‌తో సిరీస్‌.. ఆ ఐపీఎల్ బ్రహ్మాస్త్రాలతో గంభీర్ రెడీ.. ఆ లక్కీ బాయ్స్ ఎవరంటే?

India vs Afghanistan ODI Squad: ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే క్రికెట్ అభిమానులకు మరో అసలైన మజా షురూ కానుంది. సొంతగడ్డపై అఫ్గానిస్తాన్‌తో జరగనున్న ఏకైక టెస్టుతోపాటు వన్డే సిరీస్ కోసం భారత సెలెక్టర్లు కసరత్తులు పూర్తి చేశారు. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో యువ రక్తంతో కూడిన బలమైన జట్టు అఫ్గాన్ పఠాన్‌లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. ఈ సిరీస్ షెడ్యూల్, తుది జట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

IND vs AFG: ఆఫ్ఘాన్‌తో సిరీస్‌.. ఆ ఐపీఎల్ బ్రహ్మాస్త్రాలతో గంభీర్ రెడీ.. ఆ లక్కీ బాయ్స్ ఎవరంటే?
Ind Vs Afg SeriesImage Credit source: X.com
Venkata Chari
|

Updated on: May 07, 2026 | 11:17 AM

Share

India vs Afghanistan Test Squad: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రాబోయే జూన్ 2026 నెలలో అఫ్గానిస్తాన్‌తో స్వదేశీ సిరీస్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఐపీఎల్ ముగిసిన ఉత్సాహంలో ఉన్న ఆటగాళ్లు వెంటనే జాతీయ జట్టు తరఫున మైదానంలోకి దిగనున్నారు. జూన్ 6 నుంచి 10 వరకు కొత్త చండీగఢ్‌లోని ముల్లాంపూర్ స్టేడియంలో ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుంది. అనంతరం, జూన్ 14 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.

టెస్టు జట్టులో కీలక మార్పులు: గిల్ చేతికి పగ్గాలు..

అఫ్గానిస్తాన్‌తో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభించనుండగా, మధ్య వరుసలో దేవదత్ పడిక్కల్, రిషబ్ పంత్ వంటి ప్రతిభావంతులు జట్టుకు వెన్నెముకగా నిలవనున్నారు. ఆల్‌రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యువ సంచలనం నితీష్ కుమార్ రెడ్డి ఎంపికయ్యారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ప్రత్యర్థి బ్యాటర్లకు సవాలు విసరనున్నాడు. పేస్ విభాగంలో మొహమ్మద్ సిరాజ్ నాయకత్వంలో ప్రసిద్ధ్ కృష్ణ, అన్షుల్ కంబోజ్, ఆకాష్ దీప్ వంటి బౌలర్లు తమ సత్తా చాటనున్నారు.

వన్డే సిరీస్: సీనియర్ల రాకతో పెరగనున్న బలం..

వన్డే సిరీస్‌లో భారత్ మరింత పటిష్టంగా కనిపిస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ ఆటగాళ్లు జట్టులోకి రానుండటంతో భారత బ్యాటింగ్ లైనప్ బలంగా మారింది. గిల్, రోహిత్ ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగనుండగా, మూడో స్థానంలో విరాట్ కోహ్లీ తన విశ్వరూపాన్ని ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నాడు. మధ్య ఓవర్లలో వికెట్లు పడకుండా శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ బాధ్యత తీసుకోనున్నారు.

ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా రాక జట్టుకు భారీ ఊరటనిస్తుంది. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా స్పిన్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ కీలక పాత్ర పోషించనున్నారు. పేస్ బౌలింగ్ విభాగంలో అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్ ప్రత్యర్థిని కట్టడి చేసే బాధ్యతను మోయనున్నారు.

షెడ్యూల్ వివరాలు:

ఏకైక టెస్ట్: జూన్ 6 – 10 (ముల్లాంపూర్, చండీగఢ్)

మొదటి వన్డే: జూన్ 14 (ధర్మశాల)

రెండవ వన్డే: జూన్ 17 (లక్నో)

మూడవ వన్డే: జూన్ 20 (చెన్నై)

జట్ల వివరాలు (అంచనా):

టెస్టు జట్టు: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అన్షుల్ కంబోజ్, సాయి సుదర్శన్, అర్ష్‌దీప్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి.

వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆఫ్ఘాన్‌తో సిరీస్‌.. ఆ ఐపీఎల్ బ్రహ్మాస్త్రాలతో గంభీర్ రెడీ..!
ఆఫ్ఘాన్‌తో సిరీస్‌.. ఆ ఐపీఎల్ బ్రహ్మాస్త్రాలతో గంభీర్ రెడీ..!
24 ఏళ్లుగా తెలుగులో తోపు హీరోయిన్.. 44 ఏళ్ల వయసులోనూ..
24 ఏళ్లుగా తెలుగులో తోపు హీరోయిన్.. 44 ఏళ్ల వయసులోనూ..
రైల్వేలో కొలువుల జాతర.. 11,127 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
రైల్వేలో కొలువుల జాతర.. 11,127 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
కొడుకు లేకపోతే అంత్యక్రియలు ఎవరు చేస్తారు? గరుడ పురాణంలో దాగిన..
కొడుకు లేకపోతే అంత్యక్రియలు ఎవరు చేస్తారు? గరుడ పురాణంలో దాగిన..
కిలో రూ.లక్ష.. కోట్లలో వ్యాపారం.. ఈ నల్ల బంగారం రహస్యం..
కిలో రూ.లక్ష.. కోట్లలో వ్యాపారం.. ఈ నల్ల బంగారం రహస్యం..
కుర్రాళ్లు ఫిదా అయిన ఫోక్ సాంగ్.. యూట్యూబ్‏లో రచ్చ...
కుర్రాళ్లు ఫిదా అయిన ఫోక్ సాంగ్.. యూట్యూబ్‏లో రచ్చ...
IPL 2026 Playoff: ప్లేఆఫ్ రేసు నుంచి పంజాబ్, బెంగళూరు ఔట్..?
IPL 2026 Playoff: ప్లేఆఫ్ రేసు నుంచి పంజాబ్, బెంగళూరు ఔట్..?
దోసెలు అంటుకుపోతున్నాయా? మీ ఇనుప పెనాన్ని ఇలా చేస్తే హోటల్ రుచితో
దోసెలు అంటుకుపోతున్నాయా? మీ ఇనుప పెనాన్ని ఇలా చేస్తే హోటల్ రుచితో
విజయ్ తల్లిగా, భార్యగా, ప్రియురాలిగా నటించిన టాలీవుడ్ హీరోయిన్.
విజయ్ తల్లిగా, భార్యగా, ప్రియురాలిగా నటించిన టాలీవుడ్ హీరోయిన్.
మార్నింగ్ మ్యాజిక్.. మీ తలరాత మారాలంటే.. ఉదయాన్నే ఇలా చేయండి..
మార్నింగ్ మ్యాజిక్.. మీ తలరాత మారాలంటే.. ఉదయాన్నే ఇలా చేయండి..