ఉల్లి ధర పెరిగింది.. ఎంతో తెలుసా…?

ఉల్లి ధరలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. రోజురోజుకూ ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మొన్నటి వరకు క్వింటాలు ఉల్లి ధర 1500 నుంచి 2000 ఉండేది. ఇప్పుడు ఏకంగా 3 వేలకు పెరిగింది.

ఉల్లి ధర పెరిగింది.. ఎంతో తెలుసా...?
Follow us

|

Updated on: Sep 14, 2020 | 4:41 PM

ఉల్లి ధరలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. రోజురోజుకూ ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మొన్నటి వరకు క్వింటాలు ఉల్లి ధర 1500 నుంచి 2000 ఉండేది. ఇప్పుడు ఏకంగా 3 వేలకు పెరిగింది. మార్కెట్లో ఉల్లి కిలో ధర 20 రూపాయల నుంచి 40 రూపాయలకు చేరింది.

నిన్నటి వరకూ ఉల్లి ధరలు అందుబాటులోనే ఉన్నాయి. అయితే ఇటీవలి వర్షాలకు ఉల్లి పంట ధ్వంసమైంది. మార్కెట్లోకి కొత్త స్టాక్‌ రావడం లేదు. స్టాక్‌ తక్కువగా ఉండటంతో ఉల్లికి డిమాండ్ పెరిగింది. ఫలితంగా ధర కూడా పెరిగిందంటున్నారు ఉల్లి వ్యాపారులు.

వర్షాలకు ఉల్ల పంట పాడైపోతుంది. కొత్త స్టాక్‌ మార్కెట్‌కు రాదు. దీంతో ఉల్లిగడ్డ ధర పెరుగుతుందంటున్నారు వ్యాపారులు. రిటైల్ మార్కెట్‌లో వంద రూపాయలకు ఆరు కిలోలు అమ్మన వ్యాపారులు ఇప్పుడు ఒక్కసారిగా ధరను పెంచాశారు.

కిలో రూ. 20 ఉల్లిగడ్డలు ఇప్పుడు రూ. 40 అమ్ముతున్నారు. ధర ఇలా పెరుగుతూపోతే ఉల్లిగడ్డలు కొనలేం అంటున్నారు పబ్లిక్‌. లాక్‌డౌన్‌ కారణంగా ఎవరి దగ్గరా డబ్బులు లేవనీ.. ఇలాంటి పరిస్థితుల్లో కూరగాయల రేట్లు పెరుగుతూ పోతే సామాన్యులు ఏం కొనాలి ? ఏం తినాలి.. అని ప్రశ్నిస్తున్నారు.

రాయలసీమలో వర్షాలు ఎక్కువగా పండుతున్నాయి. దీంతో వేల ఎకరాల్లో ఉల్లి పంట నాశనమై రైతులు నష్టపోతున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చే పంట కూడా వర్షాలకు పాడైపోతోంది. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు 1500 నుంచి 2 వేలు ఉన్న క్వింటాలు ఉల్లి ధర.. ఇప్పుడు 3 వేలకు చేరింది. వర్షాలు ఇలాగే కొనసాగితే ఉల్లి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు.