కశ్మీర్ మహిళలు, పిల్లల భద్రత.. అదే నా చింత: మలాలా

ఆర్టికల్ 370 రద్దు పై నోబెల్ గ్రహీత, బాలల హక్కుల నేత మలాలా యూసఫ్‌జాయ్ ట్వీట్ చేశారు. శాంతియుత మార్గంలోనే కశ్మీర్ వివాదానికి పరిష్కారం దొరుకుతుందని ఆమె తెలిపారు. జమ్ముకశ్మీర్ విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో కశ్మీర్ పిల్లలు, మహిళల భద్రత గురించి ఆందోళన చెందుతున్నట్లు మలాలా చెప్పారు. శాంతి యుతంగా జీవించగలమని.. ఒకరిని ఒకరు బాధించుకోవాల్సిన అవసరం లేదని ఆమె వ్యాఖ్యానించారు. తాను చిన్నప్పటి నుంచి కశ్మీర్ ప్రజలు గొడవలలోనే జీవిస్తున్నానని.. […]

కశ్మీర్ మహిళలు, పిల్లల భద్రత.. అదే నా చింత: మలాలా
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 08, 2019 | 5:22 PM

ఆర్టికల్ 370 రద్దు పై నోబెల్ గ్రహీత, బాలల హక్కుల నేత మలాలా యూసఫ్‌జాయ్ ట్వీట్ చేశారు. శాంతియుత మార్గంలోనే కశ్మీర్ వివాదానికి పరిష్కారం దొరుకుతుందని ఆమె తెలిపారు. జమ్ముకశ్మీర్ విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో కశ్మీర్ పిల్లలు, మహిళల భద్రత గురించి ఆందోళన చెందుతున్నట్లు మలాలా చెప్పారు. శాంతి యుతంగా జీవించగలమని.. ఒకరిని ఒకరు బాధించుకోవాల్సిన అవసరం లేదని ఆమె వ్యాఖ్యానించారు.

తాను చిన్నప్పటి నుంచి కశ్మీర్ ప్రజలు గొడవలలోనే జీవిస్తున్నానని.. పైగా తన తల్లిదండ్రులు, తాతలు చిన్నప్పట్నుంచి ఆ కల్లోలం లోనే జీవిస్తూ వచ్చారని ఆమె పేర్కొన్నారు. తాను కూడా ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. ఈ రోజు తాను కాశ్మీరీ పిల్లలు, మహిళల భద్రత గురించి ఆందోళన చెందుతున్నానని తెలిపారు. కశ్మీరీ ప్రజలు ఏడు దశాబ్దాలుగా హింసను అనుభవిస్తున్నారని అన్నారు. కశ్మీరీల బాగోగుల గురించి తాను ఆలోచిస్తానని.. ఎందుకంటే అది తన ఇల్లు అని చెప్పారు. అందరూ శాంతియుతంగా ఉండాలన్నదే తన అభిప్రాయమని మలాలా చెప్పారు.