మధ్యప్రదేశ్ లో వ్యాక్సిన్ల ‘గోల్ మాల్’ ! లక్షలాది హెల్త్ వర్కర్లు, ప్రభుత్వ ఉద్యోగుల ఫోన్ నెంబర్లు సేమ్ టు సేమ్ ?
అన్ని రాష్ట్రాల్లో ఈ నెల 13 నుంచి రెండో డోసు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం మొదలు కాగా మధ్యప్రదేశ్ మాత్రం ఈ లిస్టులో లేదు. రెండో డోసు టీకామందును ఈ నెల 19 నుంచి ఇవ్వనున్నారు.
అన్ని రాష్ట్రాల్లో ఈ నెల 13 నుంచి రెండో డోసు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం మొదలు కాగా మధ్యప్రదేశ్ మాత్రం ఈ లిస్టులో లేదు. రెండో డోసు టీకామందును ఈ నెల 19 నుంచి ఇవ్వనున్నారు. ఈ జాప్యానికి కారణం కచ్చితంగా తెలియదు. అయితే లక్ష మందికిపైగా హెల్త్ కేర్ వర్కర్లు, ప్రభుత్వ ఉద్యోగుల ఫోన్ నెంబర్లు ఒకే విధంగా ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ పరిశీలనలో వెల్లడయింది. వీరిలో 83 వేలమంది వైద్య సిబ్బంది ఉండగా 32 వేలమంది అర్బన్ అడ్మినిస్ట్రేషన్, ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది ఉన్నారు. కొంతమంది పంచాయతీ రాజ్ ఉద్యోగుల ఫోన్ నెంబర్లు కూడా ఒకే విధంగా ఉన్నాయి. ఇండోర్, జబల్పూర్, భోపాల్ తదితర నగరాల నుంచి కూడా ఐడెంటికల్ నెంబర్లను కనుగొని అధికారులు ఆశ్చర్యపోయారు.
కానీ ఇవన్నీ డూప్లికేట్ రికార్డుల్లో ఇలా ‘డూప్లికేట్’ ఫోన్ నెంబర్లు ఉన్నాయా అన్న విషయాన్ని ఆరోగ్య శాఖ మదింపు చేస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ తకరారును తేలిగ్గా తీసి పారేసింది. రిజిస్ట్రేషన్ లో ఎలాంటి ప్రాబ్లమ్ లేదని, ఏదైనా పొరబాటు ఉంటే చెక్ చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి ప్రభురాం చౌదరి అన్నారు. ఏమైనా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వ హయాంలో వ్యాక్సినేషన్ల కార్యక్రమానికి సంబంధించి వ్యక్తులపేర్లు, చిరునామాలు, మొబైల్ నెంబర్లు ప్రతిదీ ఫేక్ అని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పీసీ శర్మ ఆరోపించారు. మరీ ఇంత నిర్లక్ష్యమా అని అన్నారు. నిజానికి మొదటి డోసు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ 75 శాతం తో ముందజంలో ఉందని లోగడ కేంద్రం కితాబిచ్చింది.
మరిన్ని చదవండి ఇక్కడ :
కూతురిని సజీదహనం చేసిన కసాయి తండ్రి.. ఇష్టంలేని పెళ్లి చేసుకుందని కక్ష.. సుపారీ హంతకుడితో అమానుషం.!
‘వాళ్ళ ఆలోచనలను ప్రక్షాళన చేయాల్సిందే’, దిశారవి ఉదంతంపై హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ ట్వీట్