హైదరాబాద్ సిటీకి ‘డెంగ్యూ’ ఫీవర్.. బీ అలర్ట్

తెలంగాణలో డెంగ్యూ వ్యాధి విజృంభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా డెంగ్యూ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు డెంగ్యూ కేసులతో కిక్కిరిసిపోతున్నాయి. వారిలో కొంతమంది ఇప్పటికే మృత్యువాత పడ్డారు. ఇదిలా ఉంటే భాగ్యనగరంలో నాలుగు రకాల డెంగ్యూ వైరస్‌లు కోరలు చాచాయని డాక్టర్లు చెబుతున్నారు. దీని వలన ప్రజలకు మరింత ప్రమాదం పొంచి ఉందని వారు అన్నారు. సాధారణంగా వైరస్‌లు జన్యు పదార్ధాన్ని మార్పిడి చేసుకుంటాయని.. దీని వలన కొత్త డెంగ్యూ వైరస్‌లు వచ్చే అవకాశం కూడా ఉందని […]

హైదరాబాద్ సిటీకి ‘డెంగ్యూ’ ఫీవర్.. బీ అలర్ట్
Dengue Cases in Hyderabad
Follow us

| Edited By:

Updated on: Sep 14, 2019 | 9:37 PM

తెలంగాణలో డెంగ్యూ వ్యాధి విజృంభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా డెంగ్యూ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు డెంగ్యూ కేసులతో కిక్కిరిసిపోతున్నాయి. వారిలో కొంతమంది ఇప్పటికే మృత్యువాత పడ్డారు. ఇదిలా ఉంటే భాగ్యనగరంలో నాలుగు రకాల డెంగ్యూ వైరస్‌లు కోరలు చాచాయని డాక్టర్లు చెబుతున్నారు. దీని వలన ప్రజలకు మరింత ప్రమాదం పొంచి ఉందని వారు అన్నారు. సాధారణంగా వైరస్‌లు జన్యు పదార్ధాన్ని మార్పిడి చేసుకుంటాయని.. దీని వలన కొత్త డెంగ్యూ వైరస్‌లు వచ్చే అవకాశం కూడా ఉందని డాక్టర్లు అంటున్నారు. అంతేకాకుండా గత మూడు సంవత్సరాలుగా మరో వైరస్ వ్యాప్తి చెంది.. డాక్టర్లకు సవాల్ విసిరిందని వారు చెప్పారు. ఇటీవల నమోదైన డెంగ్యూ కేసుల్లో ఇది స్పష్టమైందని డాక్టర్లు పేర్కొన్నారు.

ఇప్పుడున్న డెంగ్యూ రకాల్లో రెండవ వైరస్(డెన్వీ-2) చాలా ప్రమాదంగా మారిందని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే ప్రతి డెంగ్యూ రకంలోనూ కొన్ని లక్షణాలు కామన్‌గా ఉంటున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. హైదరాబాద్‌లో ఉన్న పలు రకాల దోమ జాతుల వలన డెంగ్యూ జ్వరాలు పెరుగుతున్నాయని.. కొంతమంది ప్రజలకు ఈ వేర్వేరు రకాల వైరస్‌లు ఒకేసారి సోకుతున్నాయని డాక్టర్లు అంటున్నారు. అంతేకాకుండా డెంగ్యూ వచ్చిన వారికి చికెన్ గున్యా, టైఫాయిడ్ వంటి అంటు జ్వరాలు కూడా ప్రబలుతున్నాయని గాంధీ మెడికల్ కాలేజీలోని డాక్టర్ల బృందం తెలిపింది. డెంగ్యూ వచ్చిన ప్రతి ఇద్దరిలో ఒకరు ఈ అంటు జ్వరాలతో బాధపడుతున్నారని వారు పేర్కొన్నారు. ఓ సర్వే ప్రకారం 44శాతం మంది డెంగ్యూతో, 29 శాతం మంది చికెన్ గున్యాతో, 15శాతం టైఫాయిడ్‌తో బాధపడుతున్నట్లు వెల్లడైంది. దీనిపై అందరిలో అవగాహన పెంచాలని, ప్రజలు కూడా వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారు చెబుతున్నారు.