Coronavirus: కరోనా నియంత్రణ కోసం భారత్‌ తీసుకున్న నిర్ణయాలు భేష్‌.. పొగడ్తల వర్షం కురిపించిన ఐఎమ్‌ఎఫ్‌..

|

Jan 16, 2021 | 5:30 AM

IMF About India Steps For Deal With Corona: కరోనా మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడించిన విషయం తెలిసిందే. దాదాపు అన్ని రంగాలపై ఈ మహమ్మారి ప్రభావం పడింది...

Coronavirus: కరోనా నియంత్రణ కోసం భారత్‌ తీసుకున్న నిర్ణయాలు భేష్‌.. పొగడ్తల వర్షం కురిపించిన ఐఎమ్‌ఎఫ్‌..
Follow us on

IMF About India Steps For Deal With Corona: కరోనా మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడించిన విషయం తెలిసిందే. దాదాపు అన్ని రంగాలపై ఈ మహమ్మారి ప్రభావం పడింది. అగ్రరాజ్యాలుగా చెప్పుకున్న దేశాలు కూడా వైరస్‌ దాటికి తట్టుకోలేకపోయాయి. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. కరోనా వైరస్‌ నియంత్రణ కోసం అన్ని దేశాలు పోరాటం చేశాయి.
అయితే ఈ పోరాటంలో భారత్‌ ముఖ్యపాత్ర పోషించిందని ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్ (ఐఎమ్‌ఎఫ్‌) చెప్పుకొచ్చింది. కరోనా వైరస్‌ నియంత్రణ కోసం భారత్‌ తీసుకున్న కఠిన నిర్ణయాలు బాగున్నాయని పొగడ్తల వర్షం కురిపించారు. ఇక కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పరిణామాలను భారత్‌ ఎదుర్కొన్న తీరును కూడా ఐఎమ్‌ఎఫ్‌ ప్రశంసించింది. ఆర్థిక వ్యవస్థ దూకుడుగా మారేందుకు భారత ప్రభుత్వం మరింత చేయూతనివ్వాలని ఐఎమ్‌ఎఫ్‌ చీఫ్‌ క్రిస్టలీనా జార్జీవా సూచించారు. రాబోయే వరల్డ్‌ ఎకనామిక్‌ అప్‌డేట్‌లో భారత ర్యాంకు మెరుగుపడుతుందని జార్జీవా జోస్యం చెప్పారు. కరోనా వేళ ప్రభుత్వం తీసుకున్న చర్యలు భారత్‌కు మేలు చేయననున్నాయని ఆమె తెలిపారు. అంతే కాకుండా అంత భారీ జ‌నాభా ఉన్న దేశం అక‌స్మాత్తుగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర‌మ‌న్నారు.

Also Read: Ferrari Car: ఇటలీ ఫుట్‌బాల్ ప్లేయర్‌కు షాక్ ఇచ్చిన మెకానిక్.. సూపర్ ఫాస్ట్ కారును సర్వీసింగ్‌ కోసం పంపిస్తే..