కొనసాగుతున్న జూడాల ఆందోళన.. రోగులకు ఇక్కట్లు..

| Edited By: Anil kumar poka

Aug 02, 2019 | 10:35 AM

తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రులన్నీ మూతపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు డాక్టర్లంతా బంద్ పాటిస్తున్నారు. నిమ్స్‌లో ముందస్తు ఎంపిక చేసుకున్న శస్త్రచికిత్సలకు హాజరు కామని వైద్యులు వినతిపత్రం అందజేశారు. ఇక ప్రభుత్వాస్పత్రుల్లోనూ అత్యవసర సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. తమ ఆందోళనకు స్పందన రాకపోవడంతో ఆందోళనను ఉదృతం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూడాలందరూ గాంధీ ఆస్పత్రి ఆవరణలో నిరాహార దీక్ష […]

కొనసాగుతున్న జూడాల ఆందోళన.. రోగులకు ఇక్కట్లు..
Follow us on

తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రులన్నీ మూతపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు డాక్టర్లంతా బంద్ పాటిస్తున్నారు. నిమ్స్‌లో ముందస్తు ఎంపిక చేసుకున్న శస్త్రచికిత్సలకు హాజరు కామని వైద్యులు వినతిపత్రం అందజేశారు. ఇక ప్రభుత్వాస్పత్రుల్లోనూ అత్యవసర సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. తమ ఆందోళనకు స్పందన రాకపోవడంతో ఆందోళనను ఉదృతం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూడాలందరూ గాంధీ ఆస్పత్రి ఆవరణలో నిరాహార దీక్ష చేపట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించేవరకూ దీక్షను కొనసాగిస్తామని.. ఐఎంఏ, జూడాల నేతలను సంప్రదించి తమ భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తామని తెలిపారు. జూడాల ఆందోళన కారణంగా ఆపరేషన్ల కోసం వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అసలు ఎంసీఐ అంటే ఇప్పటివరకూ అమలులో ఉన్న ఎంసీఐకి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. వందమందికి పైగా సభ్యులు ఉండే ఇందులో 70 శాతం మందిని ఎన్నుకుంటున్నారు. ఇక కొత్తగా వచ్చిన ఎన్ఎంసీలో 25 మందే సభ్యులుగా ఉంటారు. వారిలో అత్యధికుల్ని కేంద్రమే నామినేట్ చేస్తుంది. అయితే కేంద్రం నియమించిన ఏడుగురు సభ్యులతో కూడిన సెర్చ్ కమిటీ ఎన్ఎంసీ చైర్ పర్సన్ పేరుని, తాత్కాలిక సభ్యుల పేర్లను సిఫారసు చేస్తుంది. కొత్త కమిషన్‌లో 8 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల్లో నలుగురు వైద్య విద్యకు సంబంధించిన వివిధ బోర్డుల అధ్యక్షులు ఉంటారు. మరో ముగ్గురిని ఆరోగ్యం, ఫార్మా, హెచ్‌ఆర్‌డీ శాఖలే సిఫారసు చేస్తాయి. ఇక వైద్య విద్యలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి, మెడికల్ ప్రాక్టీస్ అనుమతికి సంబంధించిన ఎంబీబీఎస్ చివరి ఏడాది నిర్వహించే పరీక్షనే అర్హతగా పరిగణిస్తారు.