ఈ నెల 17న దేశ వ్యాప్త సమ్మెకు దిగనున్న వైద్యులు

| Edited By:

Jun 15, 2019 | 8:14 AM

పశ్చిమబెంగాల్ జూనియర్ డాక్టర్ల సమ్మెకు మద్దతుగా భారతీయ వైద్యుల సంఘం మూడు రోజుల నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నెల 17న ఉదయం ఆరు గంటల నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు విధులు బహిష్కరించాలని అభ్యర్థించింది. డ్యూటీల్లో ఉన్న డాక్టర్లపై దాడులకు పాల్పడిన వారికి కనీసం ఏడేండ్ల జైలుశిక్ష విధించేలా చట్టం తేవాలని కేంద్రానికి ఐఎంఏ విజ్ఞప్తి చేసింది. కోల్‌కతాలోని ఎన్‌ఆర్‌ఎస్ వైద్య కళాశాల దవాఖానలో మరణించిన రోగి కుటుంబ సభ్యులు చేసిన దాడిలో ఇద్దరు జూనియర్ డాక్టర్లు […]

ఈ నెల 17న దేశ వ్యాప్త సమ్మెకు దిగనున్న వైద్యులు
Follow us on

పశ్చిమబెంగాల్ జూనియర్ డాక్టర్ల సమ్మెకు మద్దతుగా భారతీయ వైద్యుల సంఘం మూడు రోజుల నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నెల 17న ఉదయం ఆరు గంటల నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు విధులు బహిష్కరించాలని అభ్యర్థించింది. డ్యూటీల్లో ఉన్న డాక్టర్లపై దాడులకు పాల్పడిన వారికి కనీసం ఏడేండ్ల జైలుశిక్ష విధించేలా చట్టం తేవాలని కేంద్రానికి ఐఎంఏ విజ్ఞప్తి చేసింది. కోల్‌కతాలోని ఎన్‌ఆర్‌ఎస్ వైద్య కళాశాల దవాఖానలో మరణించిన రోగి కుటుంబ సభ్యులు చేసిన దాడిలో ఇద్దరు జూనియర్ డాక్టర్లు గాయపడ్డారు. దీంతో తమకు భద్రత కల్పించాలని జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె శుక్రవారానికి నాలుగో రోజుకు చేరింది. వీరికి మద్దతుగా దేశవ్యాప్తంగా వైద్యులు, జూనియర్ డాక్టర్లు నిరసన తెలిపారు.