ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో.. డేటాసైన్స్‌, ప్రోగ్రామింగ్‌‌లో.. ఆన్‌లైన్ లో బీఎస్సీ డిగ్రీ..

ఆన్‌లైన్‌ బీఎస్సి డిగ్రీ చేసే కోర్సును కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. ఐఐటీ మద్రాస్‌ సిద్ధం చేసిన ఈ డిగ్రీలో ప్రోగ్రామింగ్‌, డేటా సైన్స్‌లో మూడేళ్ల వ్యవధి కలిగిన బీఎస్సీ ఫుల్‌ టైం డిగ్రీని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు

ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో.. డేటాసైన్స్‌, ప్రోగ్రామింగ్‌‌లో.. ఆన్‌లైన్ లో బీఎస్సీ డిగ్రీ..

Edited By:

Updated on: Jul 01, 2020 | 7:20 AM

IIT Madras welcomes world’s first online BSc Degree program: ఆన్‌లైన్‌ బీఎస్సి డిగ్రీ చేసే కోర్సును కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. ఐఐటీ మద్రాస్‌ సిద్ధం చేసిన ఈ డిగ్రీలో ప్రోగ్రామింగ్‌, డేటా సైన్స్‌లో మూడేళ్ల వ్యవధి కలిగిన బీఎస్సీ ఫుల్‌ టైం డిగ్రీని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు ఐఐటీ మద్రాస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ భాస్కర్‌ రామ్మూర్తి తెలిపారు. మంగళవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ కోర్సును కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ప్రారంభించారు.

ఈ కోర్సు ప్రపంచంలోనే తొలి ఆన్‌లైన్‌ రెగ్యులర్‌ డిగ్రీ కోర్సు. దీంతో ఐఐటీ డిగ్రీ సాధించాలన్న కలను ప్రతి ఒక్కరూ నెరవేర్చుకోవచ్చని ఆయన అన్నారు. ప్రోగ్రామింగ్‌, డేటా సైన్స్‌లో ప్రపంచంలోనే తొలి బీఎస్సీ డిగ్రీ కోర్సు ఇదేనని పేర్కొన్నారు. పదో టార్టాగతిలో ఇంగ్లీష్, మ్యాథ్స్ చదివి, పన్నెండో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ కోర్సులో చేరవచ్చు. ఇతర వివరాల కోసం https://onlinedegree.iitm.ac.in/ వెబ్ సైట్ వీక్షించండి.