హేగ్ : రిటైర్డ్ భారత నావికాదళ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కేసుపై నేటి నుంచి నాలుగు రోజుల పాటు హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం విచారణ జరుపనున్నది. నేడు భారత్, రేపు పాకిస్థాన్ తమ వాదనలను వినిపించనున్నాయి. అనంతరం బుధవారం పాక్ వాదనలకు భారత్ సమాధానం ఇవ్వనున్నది. 21న పాకిస్థాన్ వాదనతో విచారణ ముగుస్తుంది. భారత్ తరఫున మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే, పాక్ నుంచి ఖవార్ ఖురేషీ వాదించనున్నారు. గూఢచర్యానికి పాల్పడటంతోపాటు తమ దేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ పాకిస్థాన్ మిలిటరీ కోర్టు 2017 ఏప్రిల్‌లో కుల్‌భూషణ్ జాదవ్‌కు మరణ దండన విధించిన సంగతి తెలిసిందే.