శాటిలైట్‌ డేటా ఆధారంగా పంట రుణాలు

|

Aug 26, 2020 | 11:49 PM

ప్రైవేట్‌ రంగ ఐసీఐసీఐ బ్యాంక్‌ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. దేశీయ బ్యాంకింగ్‌ రంగంలో తొలిసారిగా పంట రుణాల మంజూరు కోసం శాటిలైట్‌ డేటాను ఉపయోగించనున్నట్లుగా..

శాటిలైట్‌ డేటా ఆధారంగా పంట రుణాలు
Follow us on

ICICI Bank : ప్రైవేట్‌ రంగ ఐసీఐసీఐ బ్యాంక్‌ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. దేశీయ బ్యాంకింగ్‌ రంగంలో తొలిసారిగా పంట రుణాల మంజూరు కోసం శాటిలైట్‌ డేటాను ఉపయోగించనున్నట్లుగా వెల్లడించింది. ఇందు కోసం ఇస్రో, నాసా అందించే సమాచారాన్ని ఉపయోగించుకుంటామని తెలిపింది.

ఉపగ్రహాలందించే చిత్రాల ఆధారంగా రైతుల రుణ అర్హతపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. అయితే ఇందులో 40కి పైగా అంశాలను పరిశీలించి రుణాలు జారీ చేస్తామని (ICICI) ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనూప్‌ బాగ్చీ తెలిపారు. పొలాలున్న ప్రాంతం, అక్కడి నీటిపారుదల వసతులు, సాగు చేస్తున్న పంటలు, ఆ పంటల నాణ్యత తదితర అంశాలను ఈ శాటిలైట్‌ చిత్రాల ద్వారా పరిశీలించనున్నట్లుగా తెలిపారు. సాధారణంగా బ్యాంకులు ఇందుకు తమ అధికారులను పంపిస్తుంటాయి. కాని ఇక ముందు టెక్నాలజీ ఆధారంగా రుణాలు అందిస్తామని తెలిపారు. ఉపగ్రహ చిత్రాల పరిశీలన ద్వారా బ్యాంక్‌తో పాటు రైతుకూ ప్రయోజనమేనని బాగ్చీ పేర్కొన్నారు.