AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: అభిషేక్ శర్మకు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. ఏకంగా నెంబర్ 1 స్థానంతో..!

మొత్తానికి ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ భారత క్రికెట్ అభిమానులకు సరికొత్త జోష్‌ను ఇచ్చాయి. అటు ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌లోనూ, ఇటు జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లోనూ ప్రపంచ నంబర్ వన్ స్థానాలను ఆక్రమించి ప్రపంచ క్రికెట్‌పై భారత్ ఆధిపత్యాన్ని మరోసారి చాటిచెప్పారు. రాబోయే సిరీస్‌లలోనూ మనవాళ్లు ఇదే ఫామ్‌ను కొనసాగించి మరిన్ని రికార్డులను తిరగరాయాలని ఆశిద్దాం.

Team India: అభిషేక్ శర్మకు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. ఏకంగా నెంబర్ 1 స్థానంతో..!
Icc Rankings Abhishek Sharma, Ishan Kishan
Venkata Chari
|

Updated on: Jul 01, 2026 | 4:12 PM

Share

ICC Rankings: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు విశ్వరూపం ప్రదర్శించారు. టీ20, టెస్టుల్లో మనవాళ్లే అగ్రపీఠాన్ని కైవసం చేసుకుని సత్తా చాటారు. ముఖ్యంగా ఇటీవల ముగిసిన పొట్టి ప్రపంచకప్‌లో పరుగుల వరద పారించిన ఒక యువ టీమిండియా స్టార్ బ్యాటర్, ఏకంగా ప్రపంచ నంబర్ 1 స్థానాన్ని సొంతం చేసుకోవడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది.

అభిషేక్ శర్మకు బిగ్ షాక్.. సింహాసనాన్ని అధిరోహించిన ఇషాన్ కిషన్..!

ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారీ కుదుపు చోటుచేసుకుంది. టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. గత ఏడాది కాలంగా ప్రపంచ నంబర్-1 ర్యాంకులో తిరుగులేకుండా కొనసాగుతున్న తన తోటి ఆటగాడు అభిషేక్ శర్మకు ఇషాన్ కిషన్ ఊహించని షాక్ ఇచ్చాడు. అతడిని కిందకు నెట్టేసి మరీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఇద్దరు యువ బ్యాటర్ల మధ్య కేవలం 7 రేటింగ్ పాయింట్ల స్వల్ప తేడా మాత్రమే ఉండటం విశేషం. ఈ అద్భుత ఘనతతో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మల తర్వాత అంతర్జాతీయ టీ20ల్లో ప్రపంచ నంబర్-1 స్థానాన్ని అందుకున్న నాలుగో భారతీయ బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ రికార్డులకెక్కాడు.

ఇది కూడా చదవండి: IND vs ENG 1st T20I: బుడ్డోడిని తొలి బంతికే ఇంటికి పంపిస్తా.. తొడగొట్టి మరీ సవాల్ చేసిన వైభవ్ దోస్త్..!

ఇవి కూడా చదవండి

వరల్డ్ కప్ హీరోకు దక్కిన అద్భుత గౌరవం..

ఇషాన్ కిషన్ ఈ రేంజ్‌లో ప్రపంచ అగ్రస్థానానికి దూసుకెళ్లడం వెనుక అతడి కఠోర శ్రమ, అద్భుత ఫామ్ ఉన్నాయి. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో ఇషాన్ కిషన్ ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. దాదాపు 200 స్ట్రైక్ రేట్‌తో మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపిస్తూ ఏకంగా 317 పరుగులు సాధించాడు. భారత్‌ను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించినందుకు గాను ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అతడికి ఈ అద్భుత బహుమతి దక్కింది. మరోవైపు ఆల్‌రౌండర్ల జాబితాలో భారత ఆటగాడు శివమ్ దూబే మూడు స్థానాలు ఎగబాకి 7వ ర్యాంకుకు చేరుకున్నాడు.

టెస్ట్ క్రికెట్లోనూ మనదే హవా.. మళ్లీ కింగ్‌లా తిరిగొచ్చిన జస్ప్రీత్ బుమ్రా..

భారత హవా కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితం కాలేదు. సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లోనూ మన బౌలింగ్ విలుకాడు జస్ప్రీత్ బుమ్రా తన పంజా విసిరాడు. న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీని వెనక్కి నెట్టి బుమ్రా మరోసారి ప్రపంచ నంబర్ వన్ టెస్ట్ బౌలర్ కిరీటాన్ని తన సొంతం చేసుకున్నాడు. ఇక టెస్ట్ బ్యాటింగ్ విభాగంలో ఆస్ట్రేలియా డ్యాషింగ్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ తన కెరీర్లో తొలిసారిగా ప్రపంచ నంబర్-1 టెస్ట్ బ్యాటర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైన హ్యారీ బ్రూక్ రెండో స్థానానికి, జో రూట్ మూడో స్థానానికి పడిపోయారు.

ఇది కూడా చదవండి: IND vs ENG: మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. టార్చర్‌కు సిద్ధమైన ఆర్చర్.. పెవిలియన్‌కు క్యూ కట్టాల్సిందే?

భారత్‌పై గెలిచిన ఐర్లాండ్ ఆటగాళ్లకు బంపర్ ఆఫర్..

ఇటీవల టీమిండియాపై చారిత్రాత్మక సిరీస్ విజయాన్ని నమోదు చేసిన ఐర్లాండ్ జట్టు ఆటగాళ్లకు కూడా ఈ ర్యాంకింగ్స్‌లో భారీ ప్రయోజనం చేకూరింది. ఐర్లాండ్ బ్యాటర్ లోర్కాన్ టక్కర్ 4 స్థానాలు ఎగబాకి 77వ స్థానానికి, రాస్ అడైర్ 6 స్థానాలు మెరుగుపరుచుకుని 84వ స్థానానికి చేరుకున్నారు. భారత్‌తో జరిగిన సిరీస్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీసిన ఐర్లాండ్ లెఫ్టార్మ్ పేసర్ మాథ్యూ హంఫ్రీస్ తన కెరీర్ బెస్ట్ 25వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై