AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: ఏం జాతకంరా మీది.. ఎక్కడో సుడి గట్టిగానే ఉంది.. ఐసీసీ అద్దిరిపోయే గిఫ్ట్

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బహిష్కరించే వివాదం మధ్య.. ఐసీసీ పాక్ అభిమానులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. పాకిస్థాన్ ఆడే మ్యాచ్‌లకు పూర్తిస్థాయి ఉర్దూ కామెంటరీని అందించనున్నట్టు తెలిపింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

T20 World Cup: ఏం జాతకంరా మీది.. ఎక్కడో సుడి గట్టిగానే ఉంది.. ఐసీసీ అద్దిరిపోయే గిఫ్ట్
Pakistan Cricket
Ravi Kiran
|

Updated on: Feb 07, 2026 | 4:49 PM

Share

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరించే విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ), అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మధ్య తీవ్ర విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఐసీసీ పీసీబీపై కఠిన చర్యలు తీసుకుంటుందని అంతా ఊహిస్తున్న వేళ.. అనూహ్యంగా పాక్ ఫ్యాన్స్‌కు బంపరాఫర్ ఇచ్చింది. ఐసీసీ పాకిస్థాన్‌పై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, పాకిస్థానీ క్రికెట్ అభిమానులకు గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఆడే అన్ని మ్యాచ్‌లకు పూర్తిస్థాయి ఉర్దూ కామెంటరీని అందిస్తామని ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ చరిత్రలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి. ఈ ప్రత్యేక ఫీడ్‌ను ఐసీసీ స్వయంగా రూపొందించి, పాకిస్థాన్‌లోని స్థానిక టెలివిజన్ ఛానెళ్లు, వివిధ లోకల్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రసారం చేయనుంది.

ఇప్పటివరకు పాకిస్థానీ అభిమానులు ఎక్కువగా ఇంగ్లీష్ కామెంటరీపైనే ఆధారపడేవారు. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం పాకిస్థాన్‌తో తన సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలనే లక్ష్యంతో చేపట్టిందని తెలుస్తోంది. అయితే, ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం భారత క్రికెట్ అభిమానులకు ఎంతమాత్రం రుచించలేదు. పాకిస్థాన్ ఇన్ని నాటకాలు ఆడుతున్నా, ఆ దేశ అభిమానుల కోసం ఇటువంటి సౌకర్యాలను ఎందుకు కల్పిస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. ఐసీసీ చైర్మన్‌గా ఒక భారతీయుడు ఉన్నప్పటికీ, పాకిస్థాన్‌కు అనుకూలమైన ఇలాంటి కొత్త సంప్రదాయాలకు తెరలేపడం ఏమిటని నిలదీస్తున్నారు. ఒప్పందాలకు విరుద్ధంగా భారత మ్యాచ్‌ను రద్దు చేసినపాకిస్థాన్‌పై చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఇలాంటి ఆఫర్లు ఇవ్వడం సరికాదని పెదవి విరుస్తున్నారు.

ఇది చదవండి: నవ్వకండి ఇది సీరియస్ మ్యాటర్.! గుర్తుపెట్టుకోండి.. ఈసారి టీ20 వరల్డ్‌కప్ ఆస్ట్రేలియాదే

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి