Covid Vaccine:తనిప్పుడే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోబోనని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. మొదట ప్రయారిటీ గ్రూపులకు ఇవ్వాలని, వారి తరువాతే నేను వ్యాక్సిన్ షాట్ తీసుకుంటానని ఆయన చెప్పారు. తొలుత ఫ్రంట్ లైన్ వర్కర్స్ తో బాటు వృధ్ధులు, ఆయా కేటగిరీలలోని వారు ఈ టీకామందును తీసుకోవాల్సి ఉంటుందనాన్రు. మొదట ప్రజల ఆరోగ్యానికే ప్రాధాన్యమివ్వాలని ఆయన చెప్పారు. బీజేపీ నేతలు తొలి వ్యాక్సిన్ షాట్ ను తీసుకోవాలని కొందరు కాంగ్రెస్ నేతలు కొత్తగా డిమాండు చేస్తున్న విషయాన్ని చౌహాన్ గుర్తు చేస్తూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే వ్యాక్సినేషన్ ప్రారంభమైందని, దీనిపై రాధ్ధాంతం ఎందుకని ఆయన ప్రశ్నించారు. దయచేసి దీన్ని రాజకీయం చేయకండి అన్నారాయన.
కాంగ్రెస్ నాయకులు ఆనంద్ శర్మ, జైరాం రమేష్, శశిథరూర్ తో బాటు సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ సైతం ఈ వ్యాక్సిన్ పట్ల సందేహాలు వ్యక్తం చేశారు. ఇది బీజేపీ వ్యాక్సిన్ అని అఖిలేష్ ఏకంగా దీనికి పొలిటికల్ కలర్ జోడించారు. దీన్ని తాను తీసుకోబోనన్నారు.
Also Read:
బ్రిటన్‌లో మొదలైన ఆస్ట్రాజెన్‌కా-ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సినేషన్.. మొదటి టీకా తీసుకున్నది ఎవరంటే..?