నా మరో కుమారుడిని సైన్యంలోకి పంపుతా

‘‘నాకు ఇంకో కుమారుడు ఉన్నాడు.. పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పేందుకు అతడిని కూడా సైన్యంలోకి పంపుతా ’’ ఓ వీర జవాను తండ్రి చెప్పిన ఈ మాటలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. గురువారం జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన జవాన్‌లలో బీహార్ భాగల్‌పూల్‌కు చెందిన రతన్ ఠాకూర్ ఒకరు. అతడి మరణ వార్త విని తట్టుకోలేకపోయిన రతన్ ఠాకూర్  తండ్రి.. పాక్‌పై పగ తీర్చుకునేందుకు తనకు ఇంకో కుమారుడు ఉన్నాడని భావోద్వేగంతో తెలిపారు. CRPF Personnel Ratan Thakur’s […]

నా మరో కుమారుడిని సైన్యంలోకి పంపుతా

Edited By:

Updated on: Mar 07, 2019 | 8:25 PM

‘‘నాకు ఇంకో కుమారుడు ఉన్నాడు.. పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పేందుకు అతడిని కూడా సైన్యంలోకి పంపుతా ’’ ఓ వీర జవాను తండ్రి చెప్పిన ఈ మాటలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. గురువారం జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన జవాన్‌లలో బీహార్ భాగల్‌పూల్‌కు చెందిన రతన్ ఠాకూర్ ఒకరు. అతడి మరణ వార్త విని తట్టుకోలేకపోయిన రతన్ ఠాకూర్  తండ్రి.. పాక్‌పై పగ తీర్చుకునేందుకు తనకు ఇంకో కుమారుడు ఉన్నాడని భావోద్వేగంతో తెలిపారు.


‘‘దేశం కోసం నా కొడుకు ప్రాణాలు అర్పించి చరిత్రలో నిలిచిపోయాడు. ఈ తండ్రిగా ఇందుకు నేను గర్విస్తున్నాను. నా కుమారుడి మరణం నాకు బాధను కల్పించినా.. మరోవైపు గర్వపడుతున్నాను. జవాన్లను చంపి, వారి తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చిన పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పాలి. ఆ దేశానికి గుణపాఠం చెప్పడం కోసం మరో కుమారుడిని కూడా సైన్యంలోకి పంపిస్తా. అతడిని కూడా భరతమాత సేవకే అంకితం చేస్తా’’ అంటూ రతన్ ఠాకూర్ తండ్రి ఉద్వేగంగా మాట్లాడారు. ఈ మాటలు విన్న పలువురు కంటతడి పెడుతున్నారు.